*డాక్టర్ కొండా దేవయ్య పటేల్
వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెలంగాణాలో వ్యవసాయదారులు పంటను పండించడానికి సహాయపడే ఎడ్లను పూజించి గౌరవించే గొప్ప సాంప్రదాయ పండుగ ఎడ్ల పొలాల అమావాస్య. శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి వాహనం అయిన నందీశ్వరుడు మన మున్నూరు కాపుల కోడెడ్ల పండగ. వ్యవసాయం ప్రధాన వృత్తిగా జీవించే మున్నూరుకాపుల ప్రధాన పండుగ ఎడ్ల పొలాల అమావాస్య. ఎడ్లను పూజిద్దాం వ్యవసాయాన్ని రక్షిద్దాం అనే నినాదం తో విశిష్ట ఎడ్ల పొలాలమాస పండుగను చేసుకొని భవిష్యత్ తరాలకు వ్యవసాయం ప్రాముఖ్యతను తెలుపుదాం అని డాక్టర్ కొండా దేవయ్య పటేల్ అన్నారు. ఇట్టి విశిష్టమైన పండుగను తెలంగాణ మున్నూరుకాపు ప్రభుత్వ ఉద్యోగులు , విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం (టిఎంకేఈడబ్ల్యూఏ) ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ట్యాంక్ బండ్ మీద రఘుపతి వెంకట రత్నం నాయుడు విగ్రహం పక్కన స్థలంలో ఎడ్ల అలంకరణ, పూజ మరియు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండా దేవయ్య పటేల్ ముఖ్యఅతిథిగా హాజరై వేడుకలో పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అపెక్స్ కన్వీనర్ పుటం పురుషోత్తమరావు, యుగ తులసి ఫౌండేషన్ గో సంరక్షణ సమితి అధ్యక్షులు కొలిశెట్టి శివకుమార్, మున్నూరు కాపుఉద్యోగస్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాల శ్రీనివాస్ , గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు సత్యనారాయణ, మున్నూరు కాపు సంఘ రాష్ట్ర కార్యదర్శి తేళ్ల హరికృష్ణ, కార్యవర్గ కార్యదర్శి ఆకుల బాలకృష్ణ, జనరల్ సెక్రెటరీ వా సాల వెంకటేశ్వర్లు, ఉద్యోగ సంఘాల నాయకులు సీఐ వడ్డే వేణుమాధవ్, నేతి మంగమ్మ, ఆకుల రవీందర్, చలమల ప్రదీప్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించిన మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు కృతజ్ఞతలు ,ధన్యవాదాలు తెలియజేశారు.