రుద్రంగి, నేటిదాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం లో భాగంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు రుద్రంగి మండల భారస నేతలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కేసీఆర్ అభివృద్ధి సంక్షేమాన్ని సమాన స్థాయిలో ప్రజలకు అందిస్తూనే వైద్య విద్యలోనూ రాష్ట్రాన్ని ముందు ఉంచారని కొనియాడారు. జిల్లా కేంద్రంలో కేటీఆర్ చేతుల మీదుగా వైద్య కళాశాల ప్రారంభింపబడడం ఎంతో సంతోషకరమన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని జిల్లాలో మెడికల్ కాలేజీని నిర్మించి ప్రారంభిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దేగవత్ తిరుపతి,జడ్పిటిసి గట్ల మీనయ ,ఎంపీపీ గంగం స్వరూప రాణి, సెస్ చైర్మన్ ఆకుల గంగారం నాయకులు కేసిరెడ్డి నర్సిరెడ్డి కాదాసు లక్ష్మణ్ ,శ్యామ్, దయ్యాల నారాయణ, దయ్యాల కమలాకర్ ,దయ్యాల పెద్దలు, గెంటే ప్రశాంత్, దాసరి గంగరాజo, మరిగడ్డ సతీష్, చెప్పాలా గణేష్, గొల్లెం నర్సింగ్,అంబటి రాములు, మరియు బారాస కార్యకర్తలు
తదితరులు పాల్గొన్నారు.
కృతజ్ఞత సభకు బయలుదేరిన భారస నేతలు
