సీఎం బహిరంగసభ స్థలం పరిశీలన చేసిన జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్

 

మంథని :- నేటి ధాత్రి

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాగంగా నవంబర్‌ 07న మంథనిలో నిర్వహించనున్న సీఎం కేసిఆర్ బహిరంగ సభ సభా స్థలిని మంథని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్టమధూకర్‌ పరిశీలించారు. బుధవారం మంథని మున్సిపల్‌ పరిధిలోని కొత్త పెట్రోల్‌బంక్‌ సమీపంలో మంథని గోదావరిఖని ప్రధాన రహదారి పక్కన బీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ హజరయ్యే బహిరంగ సభకు స్థలాన్ని ఆయన స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. బహిరంగ సభ ఏర్పాటుకు సంబంధించిన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన నాయకులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!