జోనల్ స్థాయి చదరంగం పోటీలను విజయవంతం చేయండి

మందమర్రి, నేటిధాత్రి:-

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆద్వర్యంలో డిసెంబర్ 13న జిల్లా చెస్ అసోసియేషన్ నిర్వహించు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అండర్-19 బాలబాలికల జోనల్ స్థాయి చదరంగం పోటీలను విజయవంతం చేయాలని ఉమ్మడి అదిలాబాద్ జిల్లా చదరంగం అభివృద్ధి చైర్మన్ ఈగ కనకయ్య, ఆదిలాబాద్ ఎస్జిఎఫ్ కార్యదర్శి బాబురావు లు సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పట్టణంలోని బురదగూడెం లిటిల్ ఫ్లవర్స్ ఉన్నత పాఠశాలలో స్విస్ లీగ్ పద్దతిలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో గెలుపొందిన క్రీడాకారులు డిసెంబర్ 14న రంగారెడ్డి జిల్లాలో నిర్వహించు ఎస్జిఎఫ్ రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలలో పాల్గొంటారన్నారు. టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులు తమ బోనఫైడ్, ఆధార్, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు పదో తరగతి మెమో, ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం మెమో నాలుగు కాపీలు, ఎలిజిబుల్ ఫార్మ్ తీసుకొని, డిసెంబర్ 12 లోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఎస్జిఎఫ్ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి బి బాబురావు సెల్ నెంబర్ 9849922445, ఆటల వివరాలకు చీఫ్ అర్బిటర్ అంబాల కల్పన సెల్ నెంబర్ 8978146456 ను సంప్రదించాల్సిందిగా సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version