ఎస్సై దిలీప్
జాబ్ మేళా ప్రచారంతో విశేష స్పందన
కొత్తగూడ, నేటిధాత్రి :
పోలీసుల ఆధ్వర్యంలో 42 మంది నిరుద్యోగ యువత పాల్గొన్నారు
పోలీసులకు మండల ప్రజలు అభినందనలు యువత అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని
ఎస్సై దిలీప్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కైకేన్ ఆదేశాల అనుసారం బుధువారం ములుగు జిల్లా ఇంచర్ల గ్రామంలో మెగా జాబు మేళకి ముందస్తుగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏజెన్సీ మండల నిరుద్యోగ యువతీ,యువకులకు ప్రతి ఒక్కరికి జాబ్ మేళా ను తెలిసేలా జాబ్ మేళా గురుంచి ప్రచారం చేసి ఈ ప్రచారంతో విశేష స్పందన తో కొత్తగూడ మండలం నుండి 42 మంది నిరుద్యోగ యువత పోలీసుల ఆధ్వర్యంలో పాల్గొనడం జరిగింది .వీరికి పూర్తి రవాణా మరియు ఇతర సదుపాయాలను పోలీసులు ఉచితంగా కల్పించారు.ఈ సందర్బంగా ఎస్సై దిలీప్ మాట్లాడుతూ….. మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీ పడాలి. శ్రద్ధాసక్తులతో విద్యాభ్యాసం పూర్తి చేసి భవిష్యత్‌పై ఆలోచనతో ముందుకు సాగాలని యువత ఖాళీగా ఉండకుండా తన విద్యార్హతకు తగిన ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా వచ్చిన ఉద్యోగంలో ప్రతిభ కనబర్చడం ద్వారా యువత అనుకున్న లక్ష్యాలను సాధించడం సులభం అవుతుందన్నారు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పోలీస్‌శాఖ మీ తోడుగా ఉంటుందని అన్నారు. పోలీసులు కేవలం శాంతి భద్రతల పరిరక్షణకు మాత్రమే పరిమితం కాకుండా.. సమాజ సేవలోనూ ముందుంటారాని మండల ప్రజలు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమం లో పోలీసులు భోజ్యనాయక్,గణపతి, ప్రశాంత్, కిషోర్, భరత్, ఈర్య నాయక్ భారీగా యువత పాల్గొన్నారు.