ఆరే సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మటికే సంతోష్
రేగొండ(కొత్తపల్లి గోరి)నేటి ధాత్రి:
కొత్తపల్లి గోరి మండల కేంద్రంలోని బంగ్లా వద్ద సోమవారం మహారాజ్ ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను గోరికొత్తపల్లి ఆరే సంక్షేమ సంఘం అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.జయంతి వేడుకల్లో కేక్ కట్ చేసి శోభాయాత్ర చేశారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శివాజీ మహారాజ్ ఏ ఒక్క కులానికి లేదా సంఘానికి చెందిన వ్యక్తి కాదని, ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలిసిన గొప్ప రాజు అన్నారు.శివాజీ మహారాజ్ ఒంటరిగా వచ్చి దేశాన్ని పరిపాలించే మహా చక్రవర్తి అయ్యాడని, తన తల్లి ఒడి నుండి తన తల్లి కొంగు చాటునుండి విద్య బుద్దులు నేర్చుకొని దేశాన్ని ప్రేమించాలని చాటి చెప్పారు.
ఆడవాళ్ళని, ఇతర మతాలను ఎలా గౌరవించాలో చాటి చెప్పిన మహా రాజు శివాజీ అని అంతే కాకుండా పుట్టిన దేశాన్ని, గడ్డను ప్రేమించాలని, దేశం కోసం ప్రాణం సైతం లెక్క చేయద్దు అని నినదించిన దేశ భక్తుడు శివాజీ అన్నారు.నేడు ఎన్నో దేశాలలో శివాజీ అంటే ఒక స్పూర్తి శిఖరం అయ్యారన్నారు.ఈ కార్యక్రమంలో ఆరే సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మటికే సంతోష్,ఆరే సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వంచనగిరి వీరేశం,ఆరే సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు రగుసాల తిరుపతి,ఆరే సంక్షేమ సంఘం గోరి కొత్తపల్లి గ్రామ అద్యక్షుడు ఓన్నాల శివాజీ, ఎంపీటీసీ హమీద్,నాయకులు నిమ్మల రాజు,ఆరే సంక్షేమ సంఘం కుల పెద్ద మనుషులు పకిడే సంతోష్,కరాబు రాజు,దుమాల అంకుస్,రగుసాల వీరన్న, పెర్వల కిషన్ రావు,ఛత్రపతి శివాజీ మహారాజ్ అభిమాన సంఘం ఉపాధ్యక్షుడు లింగంపల్లి కృష్ణ, బాష్పెల్లి నరేష్,ఇంగే యుగెందార్, మరిగిద్దే రాజు,శాపతి రాజు, వంచనగిరి రాజు,కుడ్లే నర్సింగం, సుఖినే సంజి,దుమాల కిషన్, రగుసాల మహేందర్,తుమ్మరపెల్లి వేణు,శాపతి వీరన్న,వంచనగిరి శ్రీను,ఇటుకాల లింగారావు,
రాజేందర్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.