# మహిళపై అసభ్యకరంగా వ్యవహరించిన యువకులు
# మహిళా,అమే మరిదిపై కత్తులు,గడ్డపారతో దాడి
# బాధితుల ఫిర్యాదుతో యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
# సెక్షన్ 354,324,506 కింద కేసులు నమోదు
# నర్సంపేట పట్టణ సీఐ సుంకరి రవి కుమార్
నర్సంపేట,నేటిధాత్రి :
మద్యం మత్తులో యువకుల హల్ చల్ చేశారు.ఒక మహిళపై అసభ్యంగా ప్రవర్తించి వారి కుటుంబంపై కత్తులు,గడ్డపారతో దాడికి యత్నించారు ఈ సంఘటన నర్సంపేట పట్టణంలోని రాంనగర్ కాలనీల వద్ద శుక్రవారం సాయంత్రం జరుగగా శనివారం వెలుగులోకి వచ్చింది.కాగా బాధితుల పిర్యాదు మేరకు నర్సంపేట పట్టణ సీఐ సుంకరి రవి కుమార్ నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.బాధితులు,పట్టణ సీఐ తెలిపిన వివరాల ప్రకారం నర్సంపేటకు చెందిన నలుగురు యువకులు షేక్ రషీద్ అలియాస్ శెట్టి,మహమ్మద్ అఖిల్,షేక్ అష్రఫ్ లు మటన్,చికెన్ దుకాణాల్లో పనిచేస్తున్నారు.శుక్రవారం పట్టణంలో మద్యంతో డిన్నర్ చేసి మద్యం మత్తులో వెళ్తుండగా రాంనగర్ కాలనీలలో ఒక కీరాణం దుకాణం వద్ద ఆ దుకాణానికి చెందిన మదాసి అనిత అనే మహిళను అంబర్ గుట్కా కావాలని అడిగారు.అందుకు ఆమె అంబర్ గుట్కాలు లేవని తెలుపడంతో ఆ నలుగురు యువకులు అసభ్య పదజాలంతో మహిళా అనితను దూషించారు.అమే తన మరిది మాదాసి నవీన్ కు తెలిపింది.శనివారం ఉదయం వారితో మాట్లాడటానికి నవీన్ వెళ్తుండగా నలుగురు యువకులు షేక్ రషీద్ అలియాస్ శెట్టి,మహమ్మద్ అఖిల్,షేక్ అష్రఫ్ లు కత్తులు,గడ్డపారతో నవీన్ పై దాడికి పాల్పడ్డారు.బాధితుల పిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని ఐపిసి 354,324,506 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ రవి కుమార్ తెలిపారు.