పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్,బిజెపి పార్టీలకు చెందిన యువ నాయకులు ఆయా పార్టీలకు రాజీనామా చేస్తూ పరకాల బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బి.ఆర్.ఎస్ లో చేరారు.వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.పార్టీలో చేరిన వారిలో రంగు రాజు, పూర్ణచందర్, బొజ్జం పరశురామ్,బయ్య శ్రీనివాస్,కలువారి అభినయ్,క్యాతమొండి గణేష్, మోడే ప్రశాంత్,శ్రీకాంత్,ప్రశాంత్,తాళ్ళ బన్నీ,రంగు రాజశేఖర్, వెంకటేశ్వర్లు, మోడే రమేష్,దుమాల విజయ్ తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,బి.ఆర్.ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
