బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడిగా యర్రపోతు మురళి కృష్ణ నియామకం

చర్ల మండల కేంద్రానికి చెందిన సామల ప్రవీణ్ బీఎస్పీ పార్టీలో చేరిక…..

భద్రాచలం నేటిదాత్రి

చర్ల జనవరి 31 నిర్భయ వార్తా
భద్రాచలం నియోజకవర్గం చర్ల మండల పరిధిలో గల సత్యనారాయణపురం గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ బుధవారం ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం లో భద్రాద్రికొత్తగూడెం జిల్లా అధ్యక్షులు నడిపింటి మధు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ నిరంతరం సమాజ పరివర్తన కార్యక్రమంలో పాల్గొంటూ, రాజకీయ చైతన్య వేదిక అయిన బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా బెహన్ జీ మాయావతి, ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో తెలంగాణాలో ఉన్న బహుజనులు బీసీ, ఎస్టీ, ఎస్ సీ లకు రాజ్యాధికారం సాధించే దిశగా ప్రయాణం చేయాలని పిలుపునిచ్చారు.
భద్రాచలం నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీని గ్రామస్థాయిలో నిర్మాణం, ఏనుగు గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లడానికి భద్రాచలం నియోజకవర్గ కమిటీని నియామకం చెసామని అన్నారు. నియోజకవర్గ అధ్యక్షులుగా యర్రపోతు మురళీకృష్ణ,
ఉపాధ్యక్షులు కొప్పుల రాంబాబు,
ప్రధానకార్యదర్శి కుమ్మరి రాంబాబు,
కార్యదర్శి తాటి ధనాకర్,
కోశాధికారిగా కొప్పుల నారాయణ, నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ జనగాం కేశవరావులను నియమించారు. అనంతరం చర్ల మండల కేంద్రంలో నూతనంగా బీసీ వర్గం నుండి సామల ప్రవీణ్ పార్టీలో చెరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తడికల శివకుమార్,
జిల్లా ఉపాధ్యక్షులు యాసం సిద్దార్థపూలే, జిల్లా కార్యదర్శి కేసుపాక కృష్ణ, బలుసుపాటి రాజు, సువ్వా వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version