ప్రపంచ జల దినోత్సవం

హసన్ పర్తి/ నేటి ధాత్రి

సమస్త జీవకోటికి నీరే ఆధారం జలమే జీవనాధారం. నీరు లేనిదే సమస్త జీవ కోటికి మనుగడ లేదు. అసలు జీవ పరిణామం ప్రారంభమైందే సముద్ర గర్భంలో అనే విషయం తెలిసిందే. ఒకప్పుడు పుష్కలంగా లభించే మంచి నీటిని అభివృద్ధి పేరిట కలుషితం చేస్తున్నాం. అవసరానికి మించి నీటిని అన్ని రకాలుగావాడుతూ వాటిని వృథా చేస్తున్నాం. దీంతో సమీప భవిష్యత్తులో నీటి కోసం ముందు ముందు, వర్షాలు కురువక,యుద్ధాలు జరిగే రోజులు కూడా రానున్నాయనడంలో, ఎలాంటి సందేహమే లేదు అనడానికి ఆశ్చర్యమేమీ లేదంటే అతిశయోక్తి కాదేమో. ఈ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే ఐక్యారాజ్య సమితి ‘ప్రపంచ జల దినోత్సవం’ (వరల్డ్ వాటర్ డే) ను నిర్వహిస్తున్నది. ప్రతి సంవత్సరం మార్చి 22న దీనిని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.
ప్రపంచంలో నేడు ప్రతి ముగ్గురిలో ఒకరికి శుద్ధమైన తాగునీరు దొరకడం లేదు
దాదాపుగా2050 నాటికి భూమి మీద నివసిస్తున్న వారిలో సుమారు 5.7 బిలియన్ల (500 కోట్ల పైమాటే) మంది సంవత్సరానికి ఒక నెల పాటు నీటి కొరత ఎదుర్కుననున్నారని అంచనా మంచి నీటి సరఫరా, పారిశుధ్యం సక్రమంగా ఉంటే ప్రతి సంవత్సరం 3,60,000 వేల మంది శిశువుల ప్రాణాలను కాపాడుకోవచ్చు
గ్లోబల్ వార్మింగ్‌ను పూర్వస్థాయి కంటే 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేస్తే వాతావరణ ప్రేరిత నీటి ఒత్తిడిని 50 శాతం వరకు తగ్గించవచ్చు
గత దశాబ్దంలో 90 శాతానికి పైగా విపత్తులు తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగానే తలెత్తాయి
2040 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఇంధన డిమాండ్ 25 శాతానికి, నీటి డిమాండ్ 50 శాతానికి పైగా పెరగనుందని అంచనా
2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా అందరికీ నీరు, పారిశుధ్యం కల్పించాలని ఐరాస లక్ష్యంగా పెట్టుకుంది
2018-2028 దశాబ్దాన్ని (వాటర్ ఫర్ సస్టెనెబుల్ డెవలప్‌మెంట్)గా ఐరాస జనరల్ అసెంబ్లీ ప్రకటించింది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాఠశాలలో సగానికంటే ఎక్కువ స్కూళ్లలో విద్యార్థులకు హ్యాండ్ వాషింగ్ సౌకర్యాలు లేవు. కనీసం చేతులు కడుక్కోవడానికి నీరు, సబ్బు కూడా అందుబాటులో లేని స్కూళ్లు చాలా ఉన్నాయి
అపరిశుభ్రమైన నీరు తాగి ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా 2,97,000 మంది (సుమారు రోజుకు 800)పిల్లలు అతిసారం బారినపడి చనిపోతున్నారు. సమస్త జీవకోటికి అవసరపడే జీవనాధారమైనటువంటి నీరు వర్షం రూపంలో కురవాలంటే అందరూ చెట్లను పెంచాలి. ఎండల్లో పక్షుల దాహార్తిని తీర్చడానికి తొట్లలో నీళ్లు ఉంచండి. పక్షుల దాహం తీర్చండి.

సందెల రాజు
హసన్ పర్తి

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version