భద్రాచలం నేటి ధాత్రి
సోమవారం నాడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు ఐటీడీఏ కార్యాలయంలో జిసిసి ద్వారా తయారుచేసిన వివిధ వస్తువులను ఆయన పరిశీలించి కొనుగోలు చేసిన అనంతరం మాట్లాడుతూ మహిళలు అందరూ కలిసికట్టుగా మరియు గ్రూపు గా ఉండి ప్రభుత్వం ద్వారా వచ్చే సబ్సిడీ రుణాలను అందిపుచ్చుకొని జీవనోపాధి కల్పించుకోవాలని ఆయన అన్నారు. గ్రూప్ మహిళలు అందరూ సొంతంగా పది శాతం కంట్రిబ్యూషన్ మరియు 30% బ్యాంకుల సహకారంతో రుణం పొంది 60 శాతం సబ్సిడీతో 25 లక్షల రూపాయల రుణం తీసుకొని చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని సబ్బులు, నూనెలు, మరియు గృహ అవసరాలకు అవసరం అయ్యే ముడి సరుకులు తయారు చేసుకొని వాటిని సరసమైన ధరలకు అమ్మకం చేసి తమ కుటుంబాలకు జీవనోపాధి కల్పించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గ్రూప్ మహిళలకు ఆయన అభినందిస్తూ ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు మహిళలు అందరూ తీసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అలాగే తోటి మహిళలను గ్రూపులుగా చేసి వారిని కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందేలా తోడ్పాటు అందించాలని ఆయన అన్నారు. అంతకుముందు భద్రాచలం మాజీ శాసనసభ్యులు పోదేం వీరయ్య గ్రూప్ మహిళలు తయారుచేసిన వస్తువులను కొనుగోలు చేశారు
ఈకార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, మరియు యూనిట్ అధికారులు, గ్రూప్ మహిళలు తాటి రాజేశ్వరి, బేబీ రాణి, పి. విజయలక్ష్మి, గ్రూప్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయము భద్రాచలం నుండి జారీ చేయడం అయినది