మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి
మహాలక్ష్మి, జ్యోతి పథకాలతో ప్రభుత్వం మహిళలకు ఆర్థిక చేయూతనందిస్తోంది
గంగాధర మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
గంగాధర నేటిధాత్రి :
పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ఆర్థిక శక్తిగా ఎదగడానికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం సహకారం అందజేస్తుంది.చొప్పదండి నియోజకవర్గం లోని మహిళా సంఘాల అభివృద్ధికి సహకారాన్ని అందజేస్తాము. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో మరమత్తు పనులను స్వశక్తి సంఘాలకు అప్పగించిన ఘనత ప్రభుత్వానికి దక్కుతోంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే స్కూల్ యూనిఫామ్ ను కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా, మహిళా సంఘాలకే అప్పగించడం జరిగింది.గంగాధర మండలంలో నాలుగు ఎకరాల్లో సోలార్ ప్యానల్ ను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాం, తహసిల్దార్ మండలంలో ఎక్కడైనా నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి ప్రపోజల్ పంపిస్తే, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సోలార్ ప్యానల్ ఏర్పాటుకు కృషి చేస్తాం.గ్రామాల్లో మహిళా సంఘం సభ్యులు సమావేశాలు నిర్వహించుకోవడానికి గ్రామ గ్రామాన అంచలంచెలుగా వివో సంఘ భవనాలను నిర్మిస్తాను.స్వశక్తి సంఘంలోని మహిళలు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి చేయూతనందించడానికి ₹ 10 లక్షల బీమా సౌకర్యం ప్రభుత్వం కల్పించింది.గంగాధర మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ఏర్పాటు చేయడం అభినందనీయం.ఈ కార్యక్రమంలో ఎమ్.ఆర్. ఓ. జోగినపల్లి అనుపమ, ఎమ్. పి. డి. ఓ. దమ్మని రాజు, ఎమ్. పి. ఓ. దాచుపల్లి జనార్దన్ రెడ్డి, ఏ. పి. ఎమ్.పవన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, శ్వాశక్తి సంఘం మహిళలు తదితరులు పాల్గొన్నారు.