ఎర్రబెల్లి స్కెచ్ తో..మొగుళ్లపల్లి మండలంలో కారు ఖాళీ

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త.. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ఎర్రబెల్లి పున్నం చందర్ రావు స్కెచ్ ఫలించింది. ఆయన మండలంలోని ప్రజాదరణ కలిగిన వ్యక్తులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో పనిచేస్తూ…మండలాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన స్వాగతాన్ని గౌరవించిన మండలంలోని ప్రజా ప్రతినిధులు మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గండ్ర సత్యనారాయణ రావు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మొగుళ్ళపల్లి ఎంపీపీ యార సుజాత-సంజీవరెడ్డి, వైస్ ఎంపీపీ పోలినేని రాజేశ్వర్ రావు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మంద సుధాకర్, మేదరమట్ల గ్రామ సర్పంచ్ కొనుకటి అరవింద్ రెడ్డిల ఆధ్వర్యంలో 300 మంది బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా..వారికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version