ఆలయ భూముల అన్యాక్రాంతం కాకుండా ప్రయత్నిస్తా….
కాంగ్రెస్స్ నియోజక వర్గ ఇంచార్జి ప్రణవ్….
నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)మండల కేంద్రంలో గల పురాతన తీగల బావి వద్ద గల భక్తానజనేయ స్వామి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని హుజురాబాద్ నియోజక వర్గ కాంగ్రెస్స్ పార్టీ ఇంచార్జి వొడితేలా ప్రణవ్ అన్నారు.ఆలయ అభివృద్ధి కమిటీ,హనుమాన్ భక్తులు పలువురు ప్రణవ్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.స్పందించిన ప్రణవ్ ఆలయ అభివృద్ధికి కావల్సిన సౌకర్యాలు మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టి కి తీసుకెళ్ళినిధులు మంజూరి అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.దానితో పాటు ఆలయ బూములు అన్యాక్రాంతం కాకుండా స్థానిక అధికారులతో మాట్లాడి దేవాలయ భూమికి హద్దులు ఏర్పాటు చేసేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమములో బ్లాక్ కాంగ్రెస్స్ ఇంచార్జి బాలసాని రమేష్ గౌడ్,నాయకులు పరశారాములు,అంకుశావళి,రమేష్,అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మండ అశోక్,రాజేష్,వేరన్నాయ్,కుమార్,సునీల్,రాజు,తిరుపతి,కిషోర్,రాజేందర్,ఆలయ అర్చకులు పరశురామచార్యులు పాల్గొన్నారు.