ఇబ్బంది పడుతున్న రైతన్నలు.
బ్రిడ్జ్ కోసం ప్రజలు ఎదురుచూపులు
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేటమండలం పత్తిపాక గ్రామం నుండి నేరేడుపల్లి పోవాలంటే వాగుపై బ్రిడ్జి నిర్మాణంకు మోక్షం ఎప్పు డెప్పుడా అని గ్రామ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రజలు మండలానికి వెళ్లాలంటే ఈ బ్రిడ్జి మార్గమే దిక్కు ఏండ్ల తరబడిన బ్రిడ్జి నిర్మాణానికి నోచుకోకపోవడంతో గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో అన్ని రాజకీయాల పార్టీలు నాయకులు బ్రిడ్జి నిర్మాణానికి హామీ ఇవ్వడం జరిగింది పత్తిపాక,నేరేడుపల్లె గ్రామానికి రోడ్డు మార్గం లేక ప్రజలు ఇబ్బందులు ఎదురవు తున్నారు. మండల గ్రామానికి అతి సమీపంగా ఉన్న రోడ్డు మార్గం వేసి బ్రిడ్జి నిర్మించకపో వడం ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు గత ప్రభుత్వం రోడ్డు మార్గము వాగుదాక వేసి కరెంటు అన్ని ఏర్పాటు చేసి బ్రిడ్జి నిర్మించకపోవడం ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.