ఎవరి నిర్లక్ష్యం విద్యార్థులకు ” నాక్” సదుపాయం లేకుండా చేసింది.
మారుమూల ప్రాంత డిగ్రీ విద్యార్థులకు “న్యాక్” ఒక వరం.
350 మంది విద్యార్థులకు “న్యాక్” నుండి దూరం చేసినట్లే.
కళాశాల అసంపూర్తి పై ఉన్నత విద్యా నిశ్శబ్దం ఎందుకు.!?
రాష్ట్ర ఐటీ మంత్రి తక్షణమే స్పందించాలి .
మహాదేవపూర్- నేటి ధాత్రి:
దేశం ఎదగడానికి అభివృద్ధి దశలో ప్రయాణించడానికి విద్యాభ్యాసం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. వాటిలో ఉన్నత విద్య పరిమాణం పెరిగిన యాక్సెస్ నాణ్యత అందించే క్రమంలో వచ్చాం విద్యా పరమాణాన్ని గుర్తించినప్పుడే దేశం ఉన్నత శిఖరాలకు దేశ పేరును నిలబెట్టుకునే వీలు కలుగుతుంది. దీనికి ఉదాహరణలు ప్రపంచంలోని అనేక దేశాలు నేడు విద్యా పరంగా ఎదిగి ఆర్థిక ఘనంగా సైతం వారి ప్రాధాన్యత మొదటి దశలో ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యకు సంబంధించి ప్రభుత్వాల వ్యవహార తీరు ఉన్నత విద్య శాఖకు సంబంధించిన అధికారుల తీరు ఓట్ల రూపాలు వెచ్చించి భవనాలు నిర్మాణం చేపట్టినప్పటికీ అసంపూర్తిభవనాలు నాసిరకం పనులతో చేపట్టి లక్షల రూపాయలను కాజేసుకున్న దేశానికి ఉన్నత స్థానంలో తీసుకువెళ్లే ఉన్నత విద్య లయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ మరియు ఉన్నత విద్యాశాఖ వ్యవహారానికి శంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ డిగ్రీ కళాశాల 8 సంవత్సరాలుగా అసంపూర్తి కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణానికి ఆదేశాలు జారీ చేసినప్పటికీ పూర్తిస్థాయిలో నాసిరకం పనులు చేపట్టి ఆరు సంవత్సరాల్లోనే శిథిల అవస్థకు చేరి ఉంటే ఉన్నత విద్య పరిమాణాలను గుర్తించి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు దారి చూపించే భారతదేశ అక్రిడేషన్ లాంటి వసతులు ఎలా అందుతాయి, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్య కమిషనర్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఎందుకు డిగ్రీ కళాశాలపై దృష్టి సాధించడం లేదో అర్థం కాని పరిస్థితి
నాసిరకం అసంపూర్తి తో “న్యాక్” గ్రేడ్ ఎలా పొందుతుంది.
2008లో ప్రారంభమైన డిగ్రీ కళాశాల 2014లో 2.25 లక్షల కోట్ల నిధులతో జి ప్లస్ భవనాన్ని నిర్మాణం కొరకు నిధులు కేటాయించి నూతన భవనాన్ని కట్టడం ప్రారంభించడం జరిగింది, 2019 వరకు అలాగే ప్రస్తుతం 2024 వరకు కూడా భవనం అసంపూర్తిగానే ఉంది. భవనం అసంపూర్తి కాకుండా చేపట్టిన పనులన్నీ నాసిరకంతో నిర్మించడం కేవలం 9 సంవత్సరాల భవనం వందల సంవత్సరాల భవనాన్ని తలపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మారుమూల ప్రాంతంలో డిగ్రీ కళాశాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంజూరు చేయడం ఎంతో సంతోషాన్ని కలిగించినప్పటికీ విద్య పరంగా జాతీయ అంతర్జాతీయ విద్యాభ్యాసం ఉద్యోగ పరిమాణాలకు సంబంధించి “నేషనల్ అక్రిడేంట్ యాక్సెస్ కౌన్సిల్” గుర్తింపు కళాశాలతో పాటు కళాశాల విద్యార్థులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.న్యాక్ లో కళాశాల గ్రేట్ సంపాదించాలంటే భవన నిర్మాణానికి సంబంధించి విద్యాపరంగా వసతులను సంపూర్ణంగా కళాశాల కలిగి ఉన్నప్పుడే నాక్ గ్రేడ్ లభిస్తుంది. కానీ ఉన్నత విద్య రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా డిగ్రీ కళాశాల అసంపూర్తిగా గత ఆరు సంవత్సరాల నుండి విద్యార్థులు అసంపూర్తి కళాశాలలో విద్యను కొనసాగించడం ప్రతి క్లాస్ రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ వరండాలు ల్యాబ్ రూములు పగుళ్లు వచ్చి పరిచిన బండలు సైతం పైకి రావడం జి ప్లస్ వన్ డిగ్రీ కళాశాల భవనం శిథిలా అవస్థకు చేరిన భవనంలో కనిపిస్తుంటే నేషనల్ అసెస్మెంట్ అక్రిడేషన్ కౌన్సిల్ గ్రేట్ అర్హత కొరకు దరఖాస్తు కూడా చేసుకోలేని పరిస్థితిలో ప్రస్తుతం మహాదేవపూర్ డిగ్రీ కళాశాల ఉండడం ఆశ్చర్యం.
ఎవరి నిర్లక్ష్యం విద్యార్థులకు “న్యాక్” సదుపాయం లేకుండా చేసింది.
గత ఆరు సంవత్సరాలుగా జి ప్లస్ వన్ మహదేవ్పూర్ డిగ్రీ కళాశాలకు నిధులు మంజూరు చేసి కళాశాల భవనానికి పూర్తిస్థాయిలో నిర్మించకుండా నిధులను పక్కదారి పట్టించి చేతులు దులుపుకోవడం జరిగింది అనడానికి ప్రస్తుత కాలేజ్ అసంపూర్తి నిర్మాణమే సాక్ష్యం. మారుమూల ప్రాంత డిగ్రీ కళాశాలకు నేషనల్ యాక్సెస్ అక్రిడేషన్ కౌన్సిల్ లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అవకాశం రావడం డిగ్రీ కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న ఐదు మండలాలకు సంబంధించిన విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం అలాగే రాబోయే విద్యార్థులకు కూడా ఉన్నత విద్య ఉపాధి కొరకు ఒక ఉజ్వల భవిష్యత్తును ఇచ్చే గొప్ప శుభ సందర్భం అవకాశం అని చెప్పవచ్చు, కానీ విద్యార్థుల దురదృష్టం ఏమిటంటే ఒకవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం మరోవైపు ఉన్నత విద్య శాఖ పట్టించుకోకపోవడం కోట్ల రూపాయలను వెచ్చించిన పూర్తిస్థాయి నిర్మాణానికి దోచుకోకపోవడం పెద్ద మొత్తంలో నిధులను అందించినప్పటికీ కూడా ఉన్నత విద్యాశాఖ కళాశాల ప్రిన్సిపాల్ అసంపూర్తిభవనంపై కాంట్రాక్టర్ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించకపోవడం నేడు మహదేవ్పూర్ డిగ్రీ కళాశాలకు కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ యాక్సెస్ అక్రిడేషన్ కౌన్సిల్ సదుపాయానికి నోచుకోకుండా చేసిందని చెప్పడంలో సందేహ పడాల్సిన అవసరం లేదు. గత ఆరు సంవత్సరాలుగా అసంపూర్తి భవనంలో తరగతులు కొనసాగుతున్నప్పటికీ కమిషనర్ ఉన్నత విద్య భవన మరమ్మతు విషయాలు అలాగే అసంపూర్తి నాసిరకం తో నిర్మించిన కాంట్రాక్టర్ పై నేటికీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అనేది ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాకుండా కళాశాల బాధ్యులుగా ఉన్న ప్రిన్సిపాల్ మరియు ఆర్జెడి కమిషనర్ల దృష్టికి ఎందుకు తీసుకపోవడం లేదు కేవలం 60 శాతం కళాశాల నిర్మాణం మిగతా 40 శాతం పనులు అసంపూర్తిగా మిగిలి ఉండడం జరిగింది. అంతేకాకుండా కాంట్రాక్టర్ చేపట్టిన పనులన్నీ కొద్ది రోజుల్లోనే కళాశాల భవనం పూర్తిగా పగుళ్లు పరిచిన బండలు బయటికి రావడం వర్షాకాలం నీటి పదను ఇలా అనేక సమస్యలతో దర్శనమిస్తున్న కళాశాల పరిస్థితిని ఉన్నత విద్య అధికారుల దృష్టికి ఎందుకు తీసుక పోవడం లేదు ఒకవేళ అదృష్టికి తీసుకపోయినా కమిషనర్ మరియు ఆర్జెడీలు నిశ్శబ్దం వహించడం వెనుక కారణమేమిటి ఉన్నత విద్య శాఖ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం నేడు విద్యార్థులకు న్యాక్ సదుపాయం లేకుండా చేసిందని చెప్పడంలో సందేహ పడాల్సిన అవసరం లేదు.
మారుమూల ప్రాంత డిగ్రీ విద్యార్థులకు “న్యాక్” ఒక వరం.
ఎన్ ఏ సి న్యాక్ అంటే నేషనల్ అసెస్మెంట్ ఆఫ్ అక్రిడేషన్ కౌన్సిల్. ఉన్నత విద్య యొక్క పరిమాణాన్ని అందిస్తూ నాణ్యత విద్య అకాడమిక్ ప్రీమియం ఎన్ ఏ ఏ సి విద్యా వ్యవస్థను వాటి పనితీరును అంచనా వేయుటకు ఏర్పాటు చేయబడింది. అంతర్జాతీయ పరంగా విద్యార్థులను ఎన్ ఏ సి గ్రేడ్ కళాశాల సర్టిఫికెట్ ఎంతో ఉపయోగపడుతుంది. మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలకు ఎన్ ఏ ఏ సి అవకాశం రావడం ఎంతో విశేషం, 2008లో డిగ్రీ కళాశాల ఏర్పడి నేక్ యొక్క అర్హతకు రెండు డిగ్రీ బ్యాచ్ లను పూర్తి చేసి ఆరు సంవత్సరాలు కళాశాల జిల్లా మరియు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతంలో కళాశాల ఉన్నట్టు గుర్తింపు కలిగిన అర్హతలు మహదేవ్పూర్ కళాశాలకు ఉండడంతో ఎం ఏ ఏ సి యొక్క అసెస్మెంట్ మరియు అక్రిడేషన్ ప్రక్రియకు అర్హత కొరకు అవకాశం కలిగి ఉంది. ఇలా మారుమూల ప్రాంత విద్యార్థులకు ఒక వరంగా ఉన్న న్యాక్ అవకాశం చేజారి పోయిందని స్పష్టంగా కనబడుతుంది, కళాశాల న్యాక్ కు అర్హత ఉన్నప్పటికీ యాక్సెస్ మరియు అక్రిడేషన్ పొందడంలో క్యాంపస్ సదుపాయం ప్రత్యేక బోధన తరగతులు పరిశోధన ల్యాబ్ వసతులు కళాశాల భవనం ఇలాంటి మరమ్మత్తులు లేకుండా ప్రహరీ గోడ ఇలాంటి అర్హతలు న్యాక్ ప్రధానంగా పరిగణంలోకి తీసుకుంటుంది. డిగ్రీ కళాశాల కేవలం ఎన్ ఏ ఏ సి దరఖాస్తు చేసుకొనుటకు అర్హత ఉన్నప్పటికీ యాక్సెస్ మరియు అక్రిడేషన్ సదుపాయాల కు మాత్రం మహదేవ్పూర్ డిగ్రీ కళాశాల అర్హతలు కూలిపోయే పరిస్థితి, జి ప్లస్ వన్ పేరుకే అధునాతనమైన భవనం నేటికీ అసంపూర్తి సాంకేతిక పరిజ్ఞాన ల్యాబ్లు మరియు అవసరమైన క్యాంపస్ కళాశాల భవనం మరమ్మతుకు నోచుకోకుండా ఉండడం న్యాక్ అనర్హతకు ముఖ్య కారణం. సుమారు 5 మండలాలకు సంబంధించిన డిగ్రీ విద్యార్థులకు మారుమూల ప్రాంతం లో ఏర్పడిన కళాశాల కు ఎన్ ఏ ఏ సి అక్రిడేషన్ యాక్సెస్ ల సదుపాయాలు లేకపోవడం వలన న్యాక్ గ్రేడ్లు మహదేవ్పూర్ డిగ్రీ కళాశాల పొందలేని పరిస్థితి. మారుమూల విద్యార్థులకు ఒక వరంగా న్యాక్ గ్రేడ్ పొంది ఉండడం డిగ్రీ కళాశాల మారుమూల విద్యార్థులకు జాతీయ అంతర్జాతీయ విద్య ఉపాధి కొరకు ఎంతో ప్రావీణ్యం కలిగి ఉండేది, కానీ విద్యార్థులకు న్యాక్
సదుపాయం లేకుండా పోయింది,న్యాక్ గ్రేడ్లు మహదేవ్పూర్ డిగ్రీ కళాశాల పొందడం విద్యార్థుల కు ఒక వరంగా కాకుండా ఒక కలగా మిగిలిపోయే పరిస్థితి.
350 మంది విద్యార్థులకు “న్యాక్” నుండి దూరం చేసినట్లే.
2024 సంవత్సరానికి పూర్తి కానున్న మహదేపూర్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఎన్ ఏ ఏ సి,న్యాక్ గ్రేడ్ సదుపాయం నుండి దూరం కావడం కాయమే, వారు మూల ప్రాంత విద్యార్థులకు న్యాక్ సదుపాయంతో ముందస్తు విద్య ఉపాధి ఉన్నత విద్య కు ఒక వరం అని చెప్పవచ్చు.న్యాక్ గుర్తింపు పొందిన కళాశాల పలు సందర్భాలను బట్టి అక్రిడేషన్ గ్రేడ్ ను అందించడం జరుగుతుంది. అవి A నుండి ప్రారంభించి A+A++ తో పాటుA A, లాంటి గ్రేడ్లను అందిస్తారు, అలాగే AB,B+ గ్రేడ్లను కూడా అందించడం జరుగుతుంది.A&A గ్రేట్ లతోపాటు అక్రిడేషన్ అసెస్మెంట్ తదుపరి అంశాలపై ఒక సైకిల్ విధానం పరిగణంలోకి తీసుకొని సైకిల్ 2 సైకిల్ 3 సైకిల్ 4 హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లు సైకిల్ పరిధిని ఒక సంవత్సరం పాటు న్యాక్ షరతులకు లోబడి కళాశాల నిర్వహించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే ప్రక్రియ అనంతరం ఇవి సైకిల్ పరిగణంలోకి వస్తుంది అనంతరం మూడు సంవత్సరాల కొరకు అక్రిడేషన్ దరఖాస్తు ప్రక్రియలో సైకిల్,2,3,4, ఆరు నెలల్లో చందు గాటు అనంతరం న్యాక్ ఉన్నత విద్య కళాశాల లకు పర్యవేక్షణ కొనసాగిస్తూ ఉంటుంది ఇదే క్రమంలో డిగ్రీ కళాశాలలు’ IIQA” నాకు కళాశాల అందించిన అనంతరం AISHE అనే పోర్టల్ కోడును అందించిన అనంతరం ఎం ఏ సి పరిగణంలోకి తీసుకునే ప్రక్రియ, ఇక దీనికి సంబంధించి విద్యార్థులకు ఇటువంటి ప్రధాన ఉపయోగాలు విద్యాభ్యాసం చేసే క్రమంలోనే డిగ్రీ కళాశాల ఎన్ ఏ సి అక్రిడేషన్ గ్రేడ్లను కలిగి ఉంటే బహుళ సంస్థలు అమెజాన్ ఫ్లిప్కార్ట్ మైక్రోసాఫ్ట్ విప్రో లాంటి అంతర్జాతీయ సంస్థలు క్యాంపస్ రిక్రూట్మెంట్లను ప్రధానంగా చేపట్టే కేంద్రాలు, అంతేకాకుండా విద్యార్థులకు అందించిన కైన్విగేషన్ మరియు వైగ్రేషన్ పట్టా పత్రాల్లో ఎన్ ఏ సి లోగో కలిగి ఉండడంతో ఇతర అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగం పొందడంలో ప్రధాన పాత్ర వహించడం జరుగుతుంది, అలాగే ఉన్నత విద్యకు సంబంధించి భారత దేశంలో లేదా అంతర్జాతీయ యూనివర్సిటీలో కూడా న్యాక్ గ్రేడ్ కళాశాలను ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది,న్యాక్ అర్హత కలిగిన కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రధాన వరాల్లో ఒకటి అంతర్జాతీయంగా యూనివర్సిటీలో స్కాలర్షిప్ పిజీ విద్యాభ్యాసానికి న్యాక్ లోగో తో కలిగి ఉన్న మైగ్రేషన్ సర్టిఫికెట్ సులువుగా ఉన్నత విద్య అభ్యాసానికి ఉపయోగపడుతుంది.న్యాక్ గ్రేట్ కొరకు ఎందుకు కళాశాలలో యూనివర్సిటీలు పోటీ పడతారు అంటే ఎన్ ఏ సి అక్రిడేషన్ ఆమోదంలోకి వచ్చిన అనంతరం కళాశాల యూనివర్సిటీ గ్రేడ్ ను బట్టి వాటి యొక్క పూర్తి బాధ్యతలు న్యాక్ పరిగణంలోకి తీసుకుంటుంది, నిధులు సమకూర్చడంలోనూ కూడా న్యాక్ ముందుండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ టీచింగ్ సైంటిఫికేసన్ క్వాలిటీ విద్య అందించడంలోనూ ఎల్లప్పుడు న్యాక్ తన పర్యవేక్షణలో కొనసాగించడం జరుగుతుంది,న్యాక్ గ్రేట్ కలిగి ఉంటే వేరే ఆలోచించాల్సిన అవసరం లేదు నాణ్యమైన విద్య సాంకేతిక పరిశోధన ఇతర పద్ధతులకు చెందిన విద్య ఆయా విద్యార్థి 100% నాన్య మైన విద్య పొందినట్టేనని దేశంతో పాటు అంతర్జాతీయంగా కూడా న్యాక్ గ్రేట్ కళాశాల సంపూర్ణమైన నాణ్యత మైన విద్యను అందిస్తుందని గుర్తింపు కలిగి ఉంది. ఇలా ధాన్యమైన విద్య ఉన్నత విద్యకు అలాగే బహుళ సంస్థల్లో ఉద్యోగాలకు మహదేవ్పూర్ డిగ్రీ కళాశాలలో విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు న్యాక్ గ్రేడ్ సదుపాయం నుండి 100% దూరం చేసినట్టే అనడానికి ప్రస్తుత కాలేజీ పరిస్థితులు ఉన్నత విద్య శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం ముందు సాక్ష్యంగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది.
కళాశాల అసంపూర్తి పై ఉన్నత విద్యా నిశ్శబ్దం ఎందుకు.!?
2016 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన డిగ్రీ కళాశాల భవనాల మంజూరుకు రాష్ట్రవ్యాప్తంగా 2.25 కోట్ల రూపాలు ప్రతి కళాశాలకు నిధులను సమకూర్చి తెలంగాణ రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల్లో 32 డిగ్రీ కళాశాలలో సాధ్యమైనంత త్వరగా జి ప్లస్ వన్ భవనాలను జీవించాలని ఉన్నత విద్య శాఖ తోపాటు ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల అనుసారం జిల్లా కలెక్టర్ కరీంనగర్ ఆగస్టు 2016లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి ఈ డబ్ల్యూ ఐ డి సి డివిజన్ కరీంనగర్ తో పాటు కళాశాల ప్రిన్సిపాల్ కు భవన నిర్మాణం నిర్మాత్మకమైన పనులు నాణ్యత మైన పనులు పనుల పురోగతి కు సంబంధించి అభ్యంతరాలను తెలుపాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2016లో కొత్తగా మంజూరు చేసిన డిగ్రీ కళాశాల భవనాలు హుస్నాబాద్ గంభీరావుపేట్ మహదేవ్పూర్ చొప్పదండి మండల కేంద్రాల్లో కళాశాల భవనాలను నిర్మాణం కొరకు నిధులు కేటాయించి పనులను ప్రారంభించడం జరిగింది. కానీ 2016 లో ప్రారంభమైన మహాదేవపూర్ డిగ్రీ కళాశాల జి ప్లస్ వన్ భవనం 9 సంవత్సరాల కాలం పూర్తి అయినప్పటికీ కూడా నేటికి అసంపూర్తిగానే మిగిలి ఉంది. కాంట్రాక్టర్ చేపట్టిన పనులు సైతం పూర్తిస్థాయిలో నాసిరకంగా ఉండడం నాడు కళాశాల శిథిల అవస్థ పరిస్థితికి చేరుకొని ఉంది. అసంపూర్తి నిర్మాణం నిధుల కొరకు 2019లో కమిషనర్ ఆఫ్ కాలేజ్ హైయర్ ఎడ్యుకేషన్ అలాగే కొత్తగా ఏర్పడిన భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్ కు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు సరిపోలేదని భవనం అసంపూర్తిగా ఉందని భవనం పూర్తి స్థాయిలో నిర్మాణం కొరకు మరో నలభై ఆరు లక్షల రూపాల నుండి 57 లక్షల రూపాయల వరకు ఖర్చవుతాయని అంచనా వేస్తూ కమిషనర్ మరియు కలెక్టర్లకు ఆర్జీ పెట్టడం జరిగింది. కానీ నేటి వరకు కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్ కనీస స్పందన లేకుండా వ్యవహరించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం కొత్త కళాశాల నిర్మాణంపై వందల కోట్ల రూపాయలను వెచ్చించి భవనాలు నిర్మాణం చేపడితే భవనాల నిర్మాణ పరిస్థితులు కాంట్రాక్టర్లు చేపట్టిన నిర్మాణ నాణ్యత పై అలాగే భవనాలు పూర్తిగా నిర్మాణం చేయడం జరిగిందా లేదా మరేవైనా నిధులు అవసరమవుతాయా ప్రభుత్వం అందించిన నిధులు నూతన డిగ్రీ కళాశాల భవనాల నిర్మాణాలకు సరిపోయిందా ఇలాంటి అంశాలపై ఉన్నత విద్య శాఖ ఎలాంటి కిందిస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించలేక పోవడం ఉన్నత విద్య శాఖ భవన నిర్మాణాలకు సంబంధించి నాణ్యత అసంపూర్తి భవనాలపై గడిచిన ఆరు సంవత్సరాల నుండి స్పందించకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తుంది.
రాష్ట్ర ఐటీ మంత్రి తక్షణమే స్పందించాలి.
మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అబ్దుల్లా శ్రీధర్ బాబు ఆనాడు విద్యా శాఖ మంత్రి ఉన్న హయాంలో 2008 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మహదేవ్పూర్ డిగ్రీ కళాశాల మంథని నియోజకవర్గంలోని ఐదు మారుమూల మండలాలకు సంబంధించిన విద్యార్థు కు ఉన్నత విద్య అందించడమే లక్ష్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం డిగ్రీ కళాశాలలు మంజూరు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం 2016లో నూతన డిగ్రీ కళాశాల భవనానికి నిర్మాణం కొరకు 2.25 కోట్ల రూపాయలను ప్రభుత్వం నిధులను మంజూరు చేయడం జరిగింది. ఆదిధులతో నిర్మాణం ప్రారంభించిన డిగ్రీ కళాశాల నేటికీ అసంపూర్తి కావడం నిర్మించిన కళాశాల పెద్ద మొత్తంలో నాసిరకం పనులు చేపట్టి కేవలం 6 సంవత్సరాల కళాశాల ఈరోజు శిథిల అవస్థకు చేరుకొని ఉంది. ఆనాడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు మంజూరు చేసిన కళాశాల ఉన్నత విద్య శాఖ తోపాటు కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నియోజకవర్గం లోని మారుమూల ప్రాంతాల విద్యార్థులకు నేషనల్ యాక్సెస్ అక్రిడేషన్ లాంటి సదుపాయాలను కూడా నోచుకోకుండా చేయడం జరిగింది. పెద్ద మొత్తంలో ఖాళీ నిధుల దుర్వినియోగంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి తక్షణమే స్పందించి ఉన్నత విద్యాశాఖ అధికారులు అలాగే కాంట్రాక్టర్ పై చర్యలకు ఆదేశించి డిగ్రీ కళాశాల పూర్తిస్థాయి నిర్మాణం కొరకు అవసరమయ్యే నిధులను మంజూరు చేయాల్సిన అవసరం ఉంది.