గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో గడప సముద్రం చెరువులో నామమాత్రంగా ఒకచేప పిల్లల బండి మాత్రమే పోశారు 1450000 చేప పిల్లలు రావలసి వుంది మొదటి విడత 750000 చేప పిల్ల పొస్తామన్నారు కానీ ఇంత వరకు పోయలేదు కార్యవర్గం కళ్ళుమూసుకుంది గత ప్రభుత్వం లో తెలంగాణ రాష్ట్ర మొదటి సభాపతి అయినటువంటి సిరికొండ మదుసుదనచారి గారి హయం లో మాత్రమే ప్రభుత్వం నుండీ వచ్చిన మొత్తము చేప పిల్లలు పోసారు తరువాత నుండి ఇంత వరకు పూర్తిగా ప్రభుత్వం నుండీ వచ్చిన చేప పిల్లలు పోసిన దాఖలాలు లేవు ఇంతకముందు వున్న కార్యవర్గం ప్రభుత్వ చేప పిల్లలు కాంట్రాక్టరు కుమక్కయ్ చేపపిల్లలు అమ్ము కున్నారు అని అనుమానం కలిగింది ఎందుకు అనగా పూర్తి చేప పిల్లలు పోసిన దాఖలాలు లేవు కావున దయచేసి మాకు రావలసిన 1450000 చేప పిల్లలు పోసి మాకు జీవనాధారం కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు గారిని మరియు మత్స్యశాఖ అధికారులను వేడుకుంటున్నాము అని గణపురం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు తెలిపారు