# నేటిధాత్రి కథనానికి స్పందన..
చేతిపంపును బయటకు తీయించిన అధికారులు.
# ప్రజలకు నీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటాం..
# ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం.
# ఎంపీడీఓ జి. లలిత
ముత్తారం , నేటిధాత్రి :
ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామంలో ప్రజల కోసం వేసిన చేతి పంపు కబ్జాకు గురికాగా నేటిధాత్రి నిజాలను బయటపెట్టింది.ఐనప్పటికీ కబ్జాదారులు నేటిధాత్రి ప్రతినిదిపై బెదిరింపులకు పాల్పడ్డారు.కథనానికి మండల అభివృద్ధి ఉన్నతాధికారులు స్పందించారు.నేటిధాత్రి దినపత్రిక ప్రచురించిన వార్త కథనం నిజం అని ఆక్రమణకు గురైన చేతిపంపు ఆనవాళ్లను గుర్తించి నేటిధాత్రికి కృతజ్ఞతలు తెలిపారు.మండల అభివృద్ధి అధికారిని జి లలిత స్పందించి గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ హరికృష్ణ కు తెలుపగా గ్రామ పంచాయతీ సిబ్బందితో దగ్గర ఉండి మట్టి తీయించి లోపల ఉన్న చేతి పంపును తీయించారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ జి లలిత మాట్లాడుతూ ప్రభుత్వ చేతిపంపు కావున ఎవరికీ వారు స్వంత నిర్ణయాలు తీసుకోని ఎవరికీ కనబడకుండా కబ్జా చేసి వాడుకోవడం సరైందికాదన్నారు.పిర్యాదు చేసిన వారిపై విచక్షణారహితంగా తిట్టడం, వార్త రాసిన విలేకరిని తిట్టడం నేరమని తెలిపారు.అక్రమంగా ప్రభుత్వ చేతిపంపు ద్వంసం చేసి స్వంతానికి వాడుకున్నందుకు గాను ఫైన్ వేస్తామని తెలిపారు. మరోసారి ఏ గ్రామంలోనైన ఇలాంటి చర్యలుకు పాల్పడినట్టు అయితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎంపీడీవో హెచ్చరించారు. ఆక్రమణకు గురైన చేతిపంపు అతి త్వరలోనే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీడీఓ లలిత, స్పెషల్ ఆఫీసర్ హరికృష్ణకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నేటిధాత్రి ఎప్పుడు ముందుంటుందని భావిస్తు ధన్యవాదాలు తెలిపారు.