హనుమకొండ జిల్లా.
పరకాల నియోజకవర్గం.
*బిజెపి పార్టీ నుండి బీఆర్ఎస్ లో పలువురు చేరిక..*
బీఆర్ఎస్ తోనే సంక్షేమ పాలన కొనసాగుతుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.శనివారం పరకాల పట్టణం 1వ వార్డుకు చెందిన పలువురు బిజెపి యువనాయకులు ఆ పార్టీకి రాజీనామా చేస్తూ బీఆర్ఎస్ లో చేరారు.వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి, సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ అంటే నమ్మకమని ఆ నమ్మకంతోనే ఇతర పార్టీల నుండి బి.ఆర్.ఎస్.లో చేరుతున్నారని అన్నారు.రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో బి.ఆర్.ఎస్.ప్రభుత్వం మూడోసారి గెలవడం ఖాయమని,ప్రతిపక్ష పార్టీల అడ్రస్ గళ్ళంతవ్వడం ఖాయమని అన్నారు.
పార్టీలో చేరిన వారిలో..సంగి సంపత్,బొచ్చు శాంతికుమార్,మడికొండ సుజిత్,బండారి బాబుకుమార్,పవన్ కుమార్,బొచ్చు టోనీ, మడికొండ సిద్దు,కోగిల రంజిత్,పవన్ కళ్యాణ్,మేకల శివ,బొచ్చు చింటు, జిడ్డి రాజశేఖర్,వంశీ,పరికి అజయ్ కుమార్,దంచనాల పైడి,బొచ్చు క్రాంతి కుమార్,విజయ్ కుమార్,విడికొండ రాజు,బొమ్మకంటి రాజు,బొచ్చు బన్నీ,మడికొండ చింటు,సంగీ అన్వేష్,దంచనాల రాజేష్,ఈర్ల నాగరాజు తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,బి.ఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.