బెదిరిస్తే భయపడం..

-చోట నయీమ్ గా తీన్మార్ మల్లన్న
-కాళేశ్వరం పై అబద్దాల ప్రచారం
-బీజేపీ నాయకురాలిగా మాట్లాడుతున్నారు..
-కాంగ్రెస్, బీజేపీ‌ మిలాఖత్ అని అర్థం అవుతోంది.
-గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్..

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ :
నా మీద కక్ష సాధించాలని ప్రతి రోజు ఏదోక కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు..ఎన్ని అబద్దపు ప్రచారాలు చేసి కేసులు పెట్టినా నేను భయపడే ప్రసక్తే లేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు..శుక్రవారం జిల్లా కేంద్రంలోని బిఆర్ ఎస్ పార్టీ కార్యలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు..ఈ సందర్బంగా ముందుగా పద్మశ్రీ అవార్డు పొందిన గడ్డం సమ్మయ్యకి శుభాకాంక్షలు తెలిపారు..అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..గవర్నర్ బీజేపీ నాయకు రాలిగా మాట్లాడు తున్నారు..రాజీనామా చేసి బీజేపీ తరపున పోటీ చేసుకోవచ్చని ఏద్దెవా చేశారు..ఇది చాలా శోచనీయమన్నారు. మేధావులు, ప్రజాస్వాముకవాదులు ఇది ఖండించాలి.. కాంగ్రెస్, బీజేపీ‌ మిలాఖత్ అని అర్థం అవుతుందన్నారు.. కోదండరాం ఓకే చేసి దాసోజు శ్రవణ్ ఎందుకు చేయలేదని ఈ సందర్బంగా ప్రశ్నించారు. దాసోజు శ్రవణ్ ఇంటలరక్చువల్ కాకుండ కోదండరామ్ ఎలా అయ్యారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ షెడ్యూల్ రెండు విడతలుగా ఇవ్వడమే మిలాఖత్ అవ్వడం అని క్లియర్ గా అర్థమైందన్నారు. పక్షపాతవైఖరితో వ్యవహరిస్తుందన్నారు. వ్యక్తిగతంగా కౌశిక్ రెడ్డి మీద మాట్లాడడం సరికాదన్నారు. గత ప్రభుత్వం 1,75 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసింది.. కావాలంటే శాఖల‌వారీగా వివరాలు ఇస్తామన్నారు. టీఎస్పీఎస్సీ లో కూడా పొలిటికికల్ వాళ్ళను తీసుకున్నారు..మాకు తీసకువద్దని చెప్పి మీరు రిటైర్డ్ వాళ్లను ఎలా తిసుకున్నారని ప్రశ్నించారు. గవర్నర్ ఇవన్నీ చూడాలని గుర్తు చేశారు..ఒక సీఎం మాట్లాడే బాషనేనా..మామూలు కార్యకర్త కూడా అలా మాట్లాడడు..కాళేశ్వరం మీద పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు..1,25 లక్షల ఎకరాలకు నీళ్లు విడుదల చేశా అన్నారు. ఒక‌ మంత్రి 50 వేల ఎకరాలకు రాలేదు అంటున్నారు..సీఎం, మంత్రుల బాష, భయపెట్టడం మంచిది కాదు. అధికారం వచ్చింది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే చెల్లదు..తీన్మార్ మల్లన్న అనే వ్యక్తిని చోటా నయీమ్ ను తయారు చేస్తున్నారు. నామీదే కేసుకు పెడుతు న్నారంటే పేదల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.. తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి ఎన్ని కేసులు ఎదురైనా భయపడను..పిచ్చి వేషాలు వేస్తే జనాలు సహించరన్నారు.. ముఖ్యంగా గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు..

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version