బీసీ ల గొంతుకనవుతా! తీగల ప్రదీప్ గౌడ్ 

నాయకుల తప్పిదాలతో బీసీ ల్లో ఐక్యత సాధ్యం కావట్లేదు.

– పూలే, అంబేద్కర్ ల స్ఫూర్తి నింపుకున్న వాణ్ణి కాబట్టే మాదిగల ఉద్యమంలో దాదాపు 15 ఏళ్లు పనిచేసా.

-బీసీ ఉద్యమ అవసరాన్ని ఈ ఎన్నికలు బహిర్గతం చేశాయి.

– బీసీ లను అన్ని రంగాల్లో తిరుగులేని శక్తి గా నిలబెట్టే వరకు శ్రమిస్తా!

బీసీ రక్షణ సమితి ఆవిర్భావం!

– ఎస్సీ రిజర్వేషన్ ల వర్గీకరణ కు ఏ అడ్డంకి లేదు

– ఎంఆర్పీఎస్ ఉద్యమ స్ఫూర్తి తో బీసీ లను చైతన్యం చేస్తా 

– బీసీ లకు రక్షణ లేదు 

– బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి 

– బీసీ ల ప్రాతినిధ్యం చట్టసభల్లో తగ్గుతుండడం ప్రమాదకరం 

– కాంగ్రెస్ పార్టీ కి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కి శుభాకాంక్షలు 

– బీసీ లకు డిప్యూటీ సీఎం ఇవ్వాలి, బీసీ మంత్రుల సంఖ్యను పెంచాలి.

– రక్షణ , రిజర్వేషన్ , రాజ్యాధికారం ఎజెండా తో పోరాడుతాం.

-బీసీ రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు తీగల ప్రదీప్ గౌడ్ 

గత 15 సంవత్సరాలుగా ఎస్సీ రిజర్వేషన్ ల వర్గీకరణ పోరాటంలో పేద వర్గాలైన మాదిగ, మాదిగ ఉప కులాల పక్షాన ఉద్యమంలో కీలక పాత్ర పోషించాను అని ఇక బీసీ ప్రజల గొంతుకనయ్యి ఉద్యమిస్తానని మహాజన సోషలిస్ట్ పార్టీ మాజీ అధ్యక్షులు తీగల ప్రదీప్ గౌడ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహాజన సోషలిస్ట్ పార్టీ కి, రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఆయన ఈ రోజు సోమాజుగూడ ప్రెస్ క్లబ్ లో భవిష్యతు కార్యాచరణ ప్రకటించారు.బీసీ రక్షణ సమితి పేరుతో సామాజిక ఉద్యమ సంస్థ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.ఎస్సీ రిజర్వేషన్ ల వర్గీకరణ పోరాటం లో సుధీర్ఘ కాలం భాగస్వామ్యం అవడం అదృష్టంగా బావిస్తున్న అన్నారు. మంద కృష్ణ మాదిగ 30 ఏండ్ల స్వప్నం నెరవేరినట్లే అని, ఎస్సీ వర్గీకరణకు అడ్డంకులేం లేవని స్పష్టం చేశారు. ఈ తరుణంలో అక్కడ నా అవసరం కన్న బీసీ వర్గాల్లో ఉన్న అనైక్యతను రూపుమాపడమే కర్తవ్యంగా బావించి ఎంఎస్పీ కి రాజీనామా చేసానని తెలిపారు. కృష్ణ మాదిగ ఉద్యమ స్పూర్తి తో బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తానని ఆశ భావం వ్యక్తం చేశారు. బీసీ లకు రక్షణ లేదని, బీసీ లు ఏ స్థాయిలో ఉన్నా ఒక భయం వెంటాడుతూనే ఉందన్నారు .ఎస్సీ ఎస్టీ లకు అట్రాసిటీ ఆక్ట్ ఉన్నట్లుగానే బీసీ ల రక్షణకు చట్టం తేవాలన్నారు . బీసీ ల పరిస్థితి అడకత్తెర లో పోక చెక్క ల మారింది అన్నారు. అగ్ర కులాలతో సహజంగా ఉండే వివక్ష ,అణిచివేత ఒక వైపైతే , కొంత మంది ఎస్సీ ఎస్టీ ల వల్ల కూడా బీసీ లు భయపడే పరిస్థితి ఉండడం బాధాకరమన్నారు. ఎస్సీ,ఎస్టీ ల పైన ఎలాంటి అట్రాసిటీ జరిగిన, అది ఎవరు చేసిన చట్టప్రకారం శిక్ష పడేలా మనమే ముందుండాల్సిన అవసరం ఉందన్నారు. కొంత మంది వల్ల చట్టం దుర్వినియోగం అవుతుందన్న భావన వాస్తవం అని ,అది ముఖ్యంగా బీసీ ల విషయంలో ఎక్కువగా జరుగుతుందనే భావన సమాజం లో ఉందన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఆక్ట్ ని కాపాడుకుంటూనే బీసీ ల రక్షణ కోసం చట్టం తేవడం కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అన్యాయంగా బీసీ ల పైన పెట్టిన అక్రమ కేసు ల పట్ల ,బీసీ ల భూ ఆక్రమణ ల పట్ల , బీసీ ఉద్యోగస్థుల రక్షణ పట్ల చిత్తశుద్ధి తో పని చేస్తామన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ లు ఏదో ఒకరోజు ఏకం కావాల్సిందే అని రాజ్యాధికార ప్రయాణం చేయాల్సిందే అని అన్నారు.

75 సంవత్సరాల చరిత్రలో బీసీ ముఖ్యమంత్రి చేసుకొనే అవకాశం రాలేదని, ఈ సారి బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి ని చేస్తామని ప్రకటించిన బీసీ ల ఐక్యత ఎక్కడ కనిపించ లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న ఈటెల రాజేంద్ర, బండి సంజయ్ లు కూడా గెలవలేని పరిస్థితి రావడం అంటే బీసీ లకు రాజ్యాధికారం పైన ఆకాంక్ష ఏ మేరకు ఉందో ఇదొక సాక్ష్యం అని అన్నారు. బీసీ ల ప్రాతినిధ్యం చట్టసభల్లో తగ్గుతుండడం పెను ప్రమాదమని అని అన్నారు. 2014 లో బీసీ ఎమ్మెల్యే ల సంఖ్య 24 ఉంటే 2018 లో 20 కి వచ్చిన్సని 2023 అది 18 కి పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.సకలజనుల సర్వే ప్రకారం తెలంగాణ లో 62 శాతం బీసీ లు ఉన్నారని తేలిందని అన్నారు. కానీ ఎమ్మెల్యే ల సంఖ్య 15 శాతం మాత్రమే ఉండడం బిసి ల దుస్థితి కి నిదర్శనం అన్నారు.

నూతనంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు.కేసీఆర్ గత ప్రభుత్వంలో ముస్లిం కి డిప్యూటీ సీఎం ఇచ్చి గౌరవించారని, ప్రస్తుతం డిప్యూటీ సీఎం లు గా ఒక ఎస్సీ , ఒక ఎస్టి, సీఎం గా రేవంత్ రెడ్డి కి అవకాశం అంటున్న నేపథ్యం లో ఒక బీసీ కి డిప్యూటీ సీఎం ఇవ్వడం న్యాయమని .పక్కా రాష్టం లో డిప్యూటీ సీఎం లు 5 గురు ఉన్నారని గుర్తు చేశారు. అదేవిందంగా బీసీ లకు 50 శాతం వాటా కాబినెట్ కల్పించాలని విజ్ఞప్తి చేసారు.

బీసీ రక్షణ సమితి రక్షణ, రిజర్వేషన్, రాజ్యాధికారం లక్ష్యంగా పని చేస్తుంది అని తెలిపారు. చట్టసభల్లో రిజర్వేషన్ లను సాధించడంతో పాటు అన్ని రంగాల్లో మనం ఎంతో అంత రియర్వేషన్ కోసం ఉద్యమిస్తామని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version