శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిట్టిరెడ్డి సాంబరెడ్డి భార్య చిట్టిరెడ్డి సమ్మక్క అనారోగ్యంతో గురువారం మృతి చెందగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. మృతురాలి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల కష్టసుఖాలలో పాలుపంచు కుంటామని తెలిపారు. ఈ పరామర్శలో కాంగ్రెస్ జిల్లా నాయకులు దుబాసి కృష్ణమూర్తి, పత్తిపాక ఎంపీటీసీ గజ్జి ఐలయ్య, మండల ఉపాధ్యక్షుడు మారెపెల్లి కట్టయ్య, మండల నాయకులు మారపల్లి వరదరాజు, చిట్టి రెడ్డి జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.