భూపాలపల్లి జిల్లా బాధ్యులు మొక్కిరాల జనార్దన్ రావు
గణపురం మండల కేంద్రంలో ఘనంగా టిడిపి శ్రేణుల విజయోత్సవ సంబరాలు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయుడని తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని తెలుగుదేశం పార్టీ భూపాలపల్లి జిల్లా బాధ్యులు మొక్కిరాలజనార్దన్ రావు అన్నారు టిడిపి జిల్లా నాయకులు, ఎన్టీఆర్ వీరాభిమాని దండుగుల అశోక్ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలకే జగన్ పాలనను పాతాళంలోకి తొక్కారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలిపి అధిక మెజార్టీతో గెలిపించాలని తెలిపారు
అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి కొద్ది రోజుల్లోనే తెలంగాణ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు అనంతరం ఎన్టీఆర్ వీరాభిమాని దండుగుల అశోక్ ను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మంథని నియోజక వర్గ బాధ్యులు అందె భాస్కరాచారి పరకాల నియోజకవర్గ బాధ్యులు కందుకూరి నరేష్, వరంగల్ పార్లమెంట్ కార్యదర్శి మాచర్ల నాగేష్ రేగొండ మండల అధ్యక్షులు గాజా శ్రీనివాస్ ఎన్టీఆర్ అభిమాని సిరిగినేని బాబురావు బట్టుపల్లి పాల్గుణ యువత రాష్ట్ర నాయకులు కురుమ లక్ష్మీనారాయణ జిల్లా నాయకులు మనోహర్ తెలుగుదేశం పార్టీ యువత పాల్గొన్నారు