ఆర్ఎస్పి పై తప్పుడు ప్రసారాన్ని ఖండిస్తున్నాం

బీఎస్పీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు: అమ్మఒడి శ్రీనివాస్ ఎల్తూరి

హన్మకొండ, నేటిధాత్రి:

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై తప్పుడు కదనాలను ప్రచురించిన ఛానల్ తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు బీఎస్పీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు అమ్మఒడి శ్రీనివాస్ ఎల్తూరి పరకాల అసెంబ్లీ ఇన్చార్జిలు ఆముదాల పెళ్లి మల్లేశం గౌడ్ పెండ్యాల మహేందర్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి మేకల విష్ణు బివిఎఫ్ కన్వీనర్ కళ్యాణ్ రాజ్ బిఎస్పి నడికూడ మండల అధ్యక్షులు శనిగరపు వెంకటేష్ పరకాలలో విలేకరుల సమక్షంలో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బహుజన రాజ్యాధికార రథసారథి అట్టడుగున వర్గాలను ఆదరించిన ఆది నుంచి అనగదోక్కబడుచున్న వర్గాల విముక్తికై బానిస బతుకుల సంఖ్య నిరంతరం ప్రజల కోసం ప్రజాసేవ కోసం ఉన్నత ఉద్యోగాన్ని తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డీజీపీ ఐపీఎస్ ఉద్యోగం వదిలి ప్రజాక్షేత్రంలో ప్రజానాయకుడిగా ప్రతినిత్యం పేద ప్రజల పక్షాన ప్రశ్నించే ప్రజా గళం ప్రజల పోరాట నాయకుడు నిరుద్యోగ విద్యార్థి మహిళ రైతు కూలీ సమస్యల పై నిరంతరం ప్రజా పోరాటాలు బహుజన ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్ పై ఒక న్యూస్ ఛానల్ లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్ గారు బహుజన్ సమాజ్ పార్టీ వీడి టిఆర్ఎస్ లో కలుస్తున్నట్లు తప్పుడు వార్తలను ప్రసారం చేయబడిన వార్తలను అవాస్తవమైన వార్తలను ప్రజలను పక్కదో పట్టించే దోపిడీ పాలకవర్గాల ఏజెంట్లు వారి ఛానల్ లో తప్పుడు వార్తను బహుజన్ సమాజ్ పార్టీ హనుమకొండ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నాం
ఆర్ఎస్పి పై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే రాస్తే మీడియా సంస్థలు జైలుకు పోవాల్సిందేఅలాంటి మీడియా సంస్థలపై క్రిమినల్ కేసులతో పాటు పరువు నష్టం ధావా కేసులు వేస్తామని హెచ్చరిక చేశారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్ డిఎస్పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
బిఆర్ఎస్ లో చేరుతాడన్న తప్పుడు వార్త ఖండించిన బిఎస్పి హనుమకొండ జిల్లా అధ్యక్షులు అమ్మ ఒడి శ్రీనివాస్ ఎల్తూరి
నాగర్ కర్నూల్ నుండి ఎంపీగా పోటీ చేసి, గెలుస్తాడు అన్న వార్తను ప్రచారం చేయాలని సూచన
తెలంగాణ రాష్ట్రంలో దేశంలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మనువాద పార్టీలు కుట్రలు చేస్తూ తప్పుడు వార్తలను ప్రచారం చేసే మీడియా సంస్థలపై క్రిమినల్ కేసులతోపాటు పరువు నష్టం దావా వేస్తామని బీఎస్పీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు అమ్మఒడి శ్రీనివాస్ ఎల్తూరి హెచ్చరించారు, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీలో చేరుతాడన్న తప్పుడు వార్తను ఆయన ఖండించారు, కొన్ని రాజకీయ పార్టీలు కుట్రపూరితంగా కొన్ని మీడియా సంస్థలను అడ్డం పెట్టుకొని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని అలాంటి తప్పుడు వార్తలను బి ఎస్ పి పార్టీ ఖండిస్తుందన్నారు , ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై తప్పుడు వార్తలు రాస్తూ కుట్రలు చేస్తున్నవారు జైలుకెళ్లడానికి సిద్ధం కావాలని హెచ్చరిక చేశారు, బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రానున్న లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుండి ఎంపీగా పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తలు, వార్త పత్రికలు మీడియా సంస్థలు ప్రచారం చేయాలని సూచించారు. ఆర్ఎస్పి గెలిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదలకు సామాజికంగా, ఆర్థికంగా రాజకీయంగా జరుగుతున్న నష్టాన్ని పూడ్చడం తో పాటు పేదలకు విద్య వైద్యం ఉచితంగా అందించే ఉద్యమానికి ఊపిరి ఊదిన వాళ్ళు అవుతారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో బ్రష్టు పట్టిపోయిన వ్యవస్థను గాడిలో పెట్టాలని తను భారత పోలీస్ అధికారిగా పని అలసట లేకుండా నిరంతరం ప్రజల పక్షాన విద్యా వైద్యం ఆరోగ్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఉన్నత స్థాయికి విద్య చేరాలని అందరికీ వేద బిడ్డలకు పేద బిడ్డలకు అందని ద్రాక్షగా ఉన్న విద్య గురుకుల విద్యా విధానాల్లో మార్పులు తెచ్చి ప్రపంచం గర్వించదగ్గ ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు దిగ్విజయంగా విజయవంతం చేసిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వాన్ని బలపరుస్తూ వార్త ప్రచారాలను ఖండిస్తున్నాం అనీ అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version