వీణవంక, (కరీంనగర్ జిల్లా),
నేటి ధాత్రి:వీణవంక మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ నాయకులు ఎంపీడీవో కు వినతి పత్రం అందజేయడం జరిగింది. కావున హుజురాబాద్ నియోజకవర్గంలో ఫైలెట్ ప్రాజెక్ట్ గా చేపట్టిన దళిత బందు పథకం రెండో విడత నిధులు పూర్తి స్థాయిలో అమలుకాక అసంపూర్తిగా ఉన్న దళిత బందు భదితులైన వీణవంక, జమ్మికుంట, హుజురాబాద్, ఇల్లంతకుంట వారందరికీ తక్షణమే రెండో విడత దళిత బందు నిధులు వారు ఎంచుకున్న యూనిట్ల ప్రకారం వారి ఖాతాలోకి డబ్బులు జమచేసి, భాదిత కుటుంబాలకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ పథకం జాప్యం వలన అనేక కుటుంబాలు జీవితాలు దుర్భరం అవుతున్నాయి. ఇది ఇంకా పెరిగి పెద్దదై మరణాలకు దారితీసే అవకాశం ఉంది. అలా జరిగితే అది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యగానే పరిగణించి , తగిన స్థాయిలో ధర్మ సమాజ్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం మొత్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని తెలిజేసారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు సదానందం , రాజు, పృథ్వి రాజ్,అనిల్ ,రవికిరణ్ , వినయ్ , రాజు తదితరులు పాల్గొన్నారు.