మేలుకో యువతరమా.. మత్తును విడిచిపెట్టు ఉజ్వల భవిష్యత్తుకై నడుము కట్టు

జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు

జైపూర్, నేటి ధాత్రి :

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో బుధవారం రోజున అంతర్జాతీయ మాదకద్రవ్యల వ్యతిరేక దినము సందర్బంగా ర్యాలీ నిర్వహించి, విద్యార్థులతో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా ఏసిపి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ
ప్రజల ఆరోగ్యం, ముఖ్యంగా యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మత్తుపదార్థాల నియంత్రణే లక్ష్యంగా మంచిర్యాల జిల్లా పోలీసులు ముందుకు సాగుతున్నారని ప్రభుత్వ ఆదేశాల మేరకు పై అధికారుల పర్యవేక్షణలో మాదకద్రవ్యాల దందాపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు.
డ్రగ్స్‌, గంజాయి విక్రయించేవారు, సరఫరాదారుల సమాచారం సేకరించి వారిపై నిఘా పెట్టాం అన్నారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు కలిగిన యువత ఈ మాదకద్రవ్యాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవడం జరుగుతుందని, తల్లిదండ్రుల మానసిక వేదనకు ఈ మత్తు పదార్థాలు ,వ్యసనాలు మూల కారణం అవుతున్నాయని, విద్యార్థులు ఈ మత్తుకు బానిస అవ్వడం అనేది చాలా విచారకరమైన విషయమని, యువతరం ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ మేలుకొని భవిష్యత్తుపై దృష్టి కేంద్రీకరించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.మాదకద్రవ్యాల నిర్మూలన కోసం మంచిర్యాల జిల్లా పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని అన్నారు. మాదకద్రవ్యాలు, గంజాయి కొనుగోలు చేస్తూ పట్టుబటిన వారిని అదుపులోకి తీసుకుని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇచ్చి వారిలో మార్పు కోసం రిహాబిటేషన్ సెంటర్స్ కు పంపి వారికి కొత్త జీవితం పరిచయం చెసే ప్రయత్నంలో పోలీస్ ముందడుగు వేస్తుందాన్నారు.యువత మత్తు ఉచ్చులో చిక్కుకుని భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దని, తల్లిదండ్రులు సైతం ఇంట్లో పిల్లలు చెడుదారుల్లో వెళ్లకుండా పర్యవేక్షించాలని అన్నారు. డ్రగ్స్‌, గంజాయి, ఆల్కహాల్, గుట్కాలాంటి మత్తుపదార్థాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న పోలీసులతో పాటు మాదకద్రవ్యాల రహిత రాష్ట్ర నిర్మాణంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని సూచించారు. మత్తు విక్రయాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే డయిల్‌ 100 లేదా మీ దగ్గరిలో ఉన్న పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని ఎసిపి కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు, సిఐ మోహన్,ఎస్ఐ శ్రీధర్,ఎస్ఐ నాగరాజు, పోలీస్ సిబ్బంది ,విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version