ఉపాధి హామీ కూలీల వేతనాలు వెంటనే చెల్లించాలి

ఎంపీటీసీ గోవిందుల లావణ్య-జలపతి

గొల్లపల్లి నేటిధాత్రి:
జగిత్యాల జిల్లాగొల్లపల్లి మండలం లక్ష్మిపూర్ గ్రామంలో పెద్దగుట్ట వద్ద జరుగుతున్న ఉపాధిహామీ పనులను జిల్లా అంబుడ్స్ మెన్ కృష్ణ రెడ్డి, స్థానిక ఎంపీటీసీ గోవిందుల లావణ్య-జలపతి పరిశీలించడం జరిగింది. అనంతరం ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధిహామీ కూలీలతో మాట్లాడటం జరిగింది. వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది. అనంతరం ఎంపీటీసీ గోవిందుల లావణ్య జలపతి మాట్లాడుతూ కూలీల వేతన చెల్లిపులో జాప్యం జరుగుతున్నదని నెలల తరబడి కూలి డబ్బుల కోసం ఎదిరి చూడాల్సి వస్తుంది అన్నారు. గతంలో వారవారం వేతన చెల్లింపు జరిగేదని ఇప్పడు నెలల తరబడి వేచి చూడాల్సి వస్తుందని అన్నారు. ఉపాది పనులకు వచ్చేవారు నిరుపేద కూలీలే కాబట్టి వేతన చెల్లింపు విషయంలో జాప్యం జరగకుండ చూడాలని అంబుడ్స్ మెన్ కృష్ణారెడ్డి ని ఎంపీటీసీ లావణ్య జలపతి కోరారు. గతం లో ఉపాధి హామీ పని అంటే పండగల ఉండేది అని ఇప్పడు ఉపాధి హామీ పని అంటేనే దండగల ఉంది అన్నారు. ఉపాధి హామీ పనికి రావడానికి గ్రామాల్లో ప్రజలు విముఖత చూపుతున్నారాని లావణ్య జలపతి వాపోయారు.
ఇట్టి కార్యక్రమంలో ఎంపీటీసీ గోవిందుల లావణ్య జలపతి, గ్రామస్థులు ఆకుల సత్తయ్య,ఫీల్డ్ అసిస్టెంట్ కట్ల సత్తవ్వ,ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొనడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version