# కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తక్కల్లపెల్లి రవీందర్ రావు
నర్సంపేట,నేటిధాత్రి :
ఈ నెల 4 న వెలువడిన పార్లమెంట్ ఎన్నికల్లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆధ్వర్యంలో మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపి అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు కోసం నర్సంపేట నియోజకవర్గంలోని 6 మండలాలతో పాటు నర్సంపేట పట్టణం 283 బూతుల్లో అత్యధికంగా 55111 ఓట్ల రికార్డ్ స్థాయిలో మెజారిటీ ఇచ్చిన నేపథ్యంలో నియోజకవర్గ కన్వీనర్ ,మాజీ ఎంపిపి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తక్కల్లపెల్లి రవీందర్ రావు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న నమ్మకంతో నూరు శాతం ఓటు వేసిన అన్నివర్గాల ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా శ్రమించిన కాంగ్రెస్ పార్టీ, అనుబంధ కమిటీ ల నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.