దేశ అభివృద్ధి, సమైక్యత కోసం బిజెపికి ఓటు వేయాలి

#హ్యాట్రిక్ ప్రధానిగా నరేంద్ర మోడీ నిలుస్తారు.

#బిజెపి పాలనలో దేశం దిగుమతుల నుంచి ఎగుమతుల స్థాయికి ఎదిగింది

#మోడీ వచ్చాక దేశంలో మతకలహాలు, కర్ఫ్యూలు కనుమరుగు.

#బిజెపి సీనియర్ నాయకుడు తడుక అశోక్ గౌడ్.

నల్లబెల్లి,నేటి ధాత్రి:

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు దూసుకెళుతోందని, భారతదేశం మూడవ ఆర్థిక దేశంగా నిలబడాలి అంటే.. బిజెపికి ఓటు వేసి మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అజ్మీర సీతారాం నాయక్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బిజెపి సీనియర్ నాయకుడు తడుక అశోక్ గౌడ్ అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అశోక్ మాట్లాడుతూ.ప్రధాని నరేంద్ర మోడీ మూడవసారి గెలిచి హ్యాట్రిక్ ప్రధానిగా నిలువబోతున్నారని, అందుకు దేశ ప్రజానీకం మోదీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని మోడీ వచ్చాక మత కలహాలు, కర్ఫ్యూలు కనుమరుగయ్యయని, కాంగ్రెస్ హయాంలో దేశానికి అన్ని దిగుమతి చేసుకునే స్థాయి నుంచి, నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక భారతదేశం ఎగుమతులు చేసే స్థాయికి దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపారని ప్రపంచ దేశాల్లో భారత దేశ కీర్తిని చాటిన నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మరోసారి బలపరిచేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో అవినీతి పెరిగిపోయిందని, నేడు అవినీతి రహిత పాలనను అందిస్తూ ఆదర్శ ప్రధానిగా నిలవడం గర్వించదగ్గ విషయమని అన్నారు. 500 సంవత్సరాల భారతదేశ ప్రజల ఆకాంక్ష ఐనా అయోధ్యలో రామమందిర కలను నెరవేర్చి ఆలయంలో బాల రాముని విగ్రహ ప్రతిష్టాపన చేసి ప్రపంచ దేశాలను సైతం భారతదేశ వైపు చూసే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 370 రద్దు చేసి, ఆ రాష్ట్రానికి స్వేచ్ఛావాయువులు తీసుకువచ్చిన ఘనత బిజెపికి దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ,బిఆర్ఎస్ కుటుంబ పార్టీ లు అని, అటువంటి కుటుంబ పాలన పార్టీలకు ప్రజలు చరమగీతం పాడి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ని మండల ప్రజలు ఆదరించి అఖండ విజయాన్ని అందిస్తేమూడవసారి ప్రధానిగా నరేంద్ర మోడీ అవతారని అందుకు ప్రజలు తమ ఓటు ద్వారా బిజెపి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version