జమ్మికుంట :నేటిధాత్రి
– యేసుక్రీస్తు బోధనలు ప్రపంచానికి ఆదర్శం.
– నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు.
– ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, కేక్ కట్ చేసిన ప్రణవ్.
చెడుపై మంచికి విజయంగా,దుర్మార్గం నుంచి సన్మార్గం వైపు,మానవత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన యేసు క్రీస్తు బోధనలు ప్రపంచానికి ఆదర్శమని హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.క్రిస్మస్ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్,జమ్మికుంట,కమలాపూర్ మండలాల్లోని చర్చిల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు బోధించిన బోధనలు ఇప్పటికి ప్రపంచం ఆచరిస్తుందని తద్వారా ప్రపంచానికి శాంతిని,కరుణ,ప్రేమను పరిచయం చేసి సన్మార్గం వైపు దారి చూపారాని అన్నారు.ఏసుక్రీస్తు ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు,కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు సమన్యాయం పాటిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.