పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్

మంథని :- నేటి ధాత్రి

పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పరిశీలించారు రోగులకు అందిస్తున్న సేవలు, ఇతర సదుపాయాలను జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అడిగి తెలుసుకున్నారు. మందులు, ఆహారం అందుబాటులోనే ఉన్నాయా..అని ఆరా తీశారు. దవాఖానాలో రోగులు, అటెండెంట్లకు అందిస్తున్న ఆహారంపై ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ మాట్లాడాతూ నూతన ప్రభుత్వం ఏర్పడినందున ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితులను తెలుసుకోవడానికి తాము సందర్శించినట్లు తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మాతా శిశు ఆసుపత్రులను గొప్పగా తీర్చిదిద్దామని, వాటి వలన పేద ప్రజలకు వైద్యం అంది ఎంతో లబ్ధి చేకూరిందని అన్నారు. ఆసుపత్రిలో వైద్యులు సరిపడే సంఖ్యలో ఉన్న సిబ్బంది కొరత ఉందని, కొంతమేర మందుల కొరత ఉందని తమ దృష్టికి వచ్చిందన్నారు. నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం దృష్టికి పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలను తీసుకెళ్తామని వైద్యులతో జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్లను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది తమ కుటుంబ సభ్యుల వలె చూస్తున్నారని అన్నీ సక్రమంగా అందుతున్నాయని రోగులు తమతోనే చెప్పినట్లు తెలిపారు దేవుడు కంటే ముందుగా డాక్టర్ నే చూసే మన దేశంలో ఎలాంటి అంతరాయాలు లేకుండా పేద ప్రజలకు వైద్యం అందాలని, ఇదేవిధంగా జిల్లా ఆసుపత్రి వైద్యులు పేద ప్రజలకు సేవలు అందించాలని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ వైద్యులను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *