అడిషనల్ కలెక్టర్ రాహుల్
జైపూర్, నేటి ధాత్రి :
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం,కుందారం, గంగిపెల్లి,దుబ్బపల్లి మరియు వెంకట్రావుపల్లి గ్రామాలలో మంగళవారం రోజున అడిషనల్ కలెక్టర్ రాహుల్ పర్యటించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా ఈ గ్రామాలలోని పాఠశాలలను పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ వేసవి సెలవుల కారణంగా పాఠశాలలన్నీ ఖాళీగా ఉండడం జరుగుతుంది. కనుక చేసుకోవలసిన మరమ్మత్తులు ఉన్న ,నూతన గదుల నిర్మాణం గానీ, మరుగుదొడ్ల నిర్మాణం గానీ, పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాలను శుభ్రపరచడం గాని, నీటి సదుపాయాలని సరి చేసుకోవడం గానీ, నూతనంగా రంగులు వేసుకోవడం లాంటి కార్యక్రమాలన్నీ మే 31 లోగా పూర్తి చేసుకోవాలని అధికారులకు సూచించడం జరిగింది. అలాగే పాఠశాలలో ,పరిసరాలలో మద్యపానం,ధూమపానం లాంటి అసాంఘిక చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాహుల్, జైపూర్ ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, ఇరిగేషన్ జేఈ శశాంక్ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.