నర్సంపేట,నేటిధాత్రి :
దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామంలో డేగల మల్లేశ్వరి అనే నిరుపేద గిరిజన మహిళ దయనీయస్థితిలో తాత్కాలిక గుడారంలో నివసిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం ఆమెభర్త అనారోగ్యంతో మరణించగా తన కుమారుడు మరియు ముగ్గురు కూతుళ్లతో కడు పేదరికంలో మగ్గుతున్నారు. వారి దీన పరిస్థితిని తెలుసుకున్న విశ్వ ఫౌండేషన్, అగ్ని హోత్ర టీమ్ సభ్యులు సింగిరెడ్డి కుమారస్వామి మానవత్వంతో స్పందించి రూ.2500 ల ఆర్ధిక సహాయాన్ని తన గురువు, ప్రస్తుత మందపల్లి పాఠశాల హెడ్మాస్టర్ కర్ణకంటి రాంమూర్తి ద్వారా బాధిత చిన్నారులకు అందజేశారు.ఈకార్యక్రమంలో స్థానికులు కన్నబోయిన ఓదెలు, యాదగిరి రాజేష్ పాల్గొన్నారు.