గంగాధర నేటిధాత్రి :
గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బొమ్మకంటిపల్లి గ్రామస్తులు శనివారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ని కరీంనగర్ లోని ఆయన నివాసంలో కలిశారు. బొమ్మకంటిపల్లి గ్రామానికి బీటీ రోడ్డు వేయించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఇక్కడ నాయకులు బైరిశెట్టి సంపత్, వెంకటేష్, రామ్ రెడ్డి, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.