లక్షేటిపేట మంచిర్యాల నేటిధాత్రి; అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమాభివృద్ధిని అలాగే బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన గ్రామ నాయకులు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి బత్తుల సత్తయ్య,టిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు అంకతి గంగాధర్, మాజీ పిఎసిఎస్ మీస శ్రీనివాస్,గ్రామ కమిటీ అధ్యక్షులు కాండ్రపు శంకరయ్య, యూత్ నాయకులు బొడకుంటి మారుతి, వార్డు సభ్యులు అంకతి వెంకటేష్, గంధం బానయ్య,నాయకులు బొలిశెట్టి రాజన్న,దాసరి చిన్నయ్య, అజారుద్దీన్, నవీన్ పాల్గొన్నారు.