చిట్యాల, నేటి ధాత్రి :
చిట్యాల మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ మేనేజర్ సురేష్ ఆధ్వర్యంలో వికసి త్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్బిఐ బ్యాంకు డి ఎం తిరుపతి గారు విచ్చేసి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకాలను మనందరం సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎక్కువగా బ్యాంకుతో రుణపడి ఉన్నయని కావున ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాలను వినియోగించుకోవాలని ఆయన అన్నారు
మరియు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి చందుపట్ల కీర్తి రెడ్డి పాల్గొని మాట్లాడుతు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నో సంక్షేమ పథకాలు మన దేశాభివృద్ధి కోసం తీసుకురావడం జరిగిందని ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ లేనివారికి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందని ఆయుష్మాన్ భారత్ ద్వారా ఎంతో మంది ప్రజలకు వైద్య ఖర్చులు లేకుండా వైద్యం అందజేస్తున్నారని సుకన్య యోజన పథకం కింద ఆడపిల్లలకు ఒక వరంలా మారిందని కిసాన్ సంబంధించి 6000 రూపాయలు చొప్పున రైతులకు మేలు జరుగుతున్నదని అదేవిధంగా విశ్వకర్మ యోజన కింద 18 రకాల చేతి వృత్తుల వారికి మేలు కల్పిస్తూ ఈ రోజున వాళ్ళు వారి యొక్క సొంత కాళ్లతో నిలబడే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నారని అదేవిధంగా రైతులకు ఎరువుల మీద సబ్సిడీ ఇస్తూ ఈరోజు రైతులకు ఎంతో ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నారని కావున ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో , ఎంపీ ఓ రామకృష్ణ పంచాయతీ కార్యదర్శి రవి గ్యాస్ ఏజెన్సీ రజిత అంగన్వాడీలు ఆశా వర్కర్లు వైద్య బృందం వివిధ రకాల అధికారులు ప్రజా ప్రతినిధులు గ్రామ సర్పంచ్ ఇరుకలపాటి పూర్ణచంద్రరావు ఎంపీటీసీ కట్కురి పద్మ
బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు లింగంపల్లి ప్రసాద్ రావు చిట్యాల చిట్యాల బిజెపి మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ మండల ఉపాధ్యక్షులు పెరుమండ్ల రాజు గజనాల రవీందర్ బీజేవైఎం మండల అధ్యక్షులు శ్రీకాంత్ ఓబీసీజిల్లా కార్యదర్శి వల్లాల ప్రవీణ్ తూముల జగదీష్ కిషోర్ గుండ మణికుమార్ తదితరులు ప్రజలు పాల్గొన్నారు.