వరంగల్, నేటిధాత్రి
వరంగల్ ఆరేపల్లి ప్రధాన రహదారికి పక్కన ఉన్న లక్ష్మికాంత్ కాలనీ అభివృద్ధి కొరకు, కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మీటింగ్ కు ముఖ్య అతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు హాజరై ప్రసంగించారు. కాలనీలో నివాసముంటున్న కుటుంబాల విన్నపం స్వీకరించి కాలనీకి కావాల్సిన సీసీ రోడ్లు, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే నాగరాజు సానుకూలంగ స్పందించారు. వెంటనే కాలనీ కి సీసీ రోడ్లు మంజూరు చేసి, కాలనీ అభివృద్ధి కోసం తనవంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రధాన రహదారి పక్కన నిలుపుతున్న ఇసుక లారీల వల్ల కాలనీ వాసులకు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అక్కడ నుండి లారీలను తీపించాలని హనుమకొండ సీఐ కి తెలియచేశారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే నాగరాజు ను కాలనీ వాసులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీకాంత్ కాలనీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు లక్ష్మీకాంత్, అధ్యక్షుడు లాల్ నాయక్, సలహాదారులు శ్యామ్ ప్రసాద్, శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు రఘువీర్, కత్తుల కవిత, క్యాషియర్ నర్సయ్య కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.