మండల సాధన సమితి ఆధ్వర్యంలో వంటావార్పు

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గోపాలరావుపేట మండల సాధన సమితి ఆధ్వర్యంలో గ్రామ బస్టాండ్ చౌరస్తాలో నిరసన దీక్షలు చేపట్టారు. ఈ నిరసన దీక్షల కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు వంటావార్పు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గోపాల్ రావుపేట మండల సాధన సమితి నాయకులు మాట్లాడుతూ గోపాల్ రావుపేట గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేసేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, ఇతర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version