వనపర్తి నేటిదాత్రి
వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ భవన్ లో గురువారం ఉదయం వాల్మీకి బోయల ఆత్మీయ సమ్మేళనం ఉంటుందని బిఆర్ఎస్ నేత, మాజీ కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల్ తెలిపారు. భారీ సంఖ్యలో ప్రతి కుటుంబం నుండి హాజరుకావాలని కోరారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి, వనపర్తి అభివృద్ధి ప్రదాత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆత్మీయ సమావేశానికి హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆత్మీయ సమావేశానికి హాజరు కావాలని అయన కోరారు.