గొల్లపల్లి నేటి ధాత్రి:
జాతీయ పశు వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ గ్రామంలో పశువులకి (గోజాతి, గేదె జాతి) గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ…. గాలికుంటు వ్యాధి దేశవాళీ పశువుల్లో కన్నా సంకరజాతి పశువుల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుందని దేశవాళీ పశువుల్లో ప్రాణ నష్టం అంతగా ఉండదని మార్చి ,ఏప్రిల్, ఆగస్టు మాసాలలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుందన్నారు. ఇది పికోర్నా విరిడే కుటుంబానికి చెందిన అప్తోస్ వైరస్ వల్ల వస్తుందని చెప్పారు. వ్యాధి సోకిన ఆవులు, గేదెలు పాలు ద్వారా దూడలకి వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన ఆవులు, గేదెలు పాల ద్వారా దూడలకి వ్యాపిస్తుంది. వ్యాధి లక్షణాలు జ్వరం 103 – 106 డిగ్రీల ఫారెన్ హీట్ కి పెరుగుతుంది. పశువుల నోటిలో, చిగుళ్ల పై పొక్కులు ఏర్పడటం వల్ల అవి మేత నీళ్లు తీసుకోలేక నిరసించిపోతాయి. నోరు, గిట్టలు మధ్యలో బొబ్బలు ఏర్పడటం 2 -3 వారాల్లో అవి చితికి పుండ్లు గా మారటం నోటి నుంచి చొంగ కారుతుంది. పాల ఉత్పత్తి తగ్గుతుంది.
వ్యాధిని ఎలా నివారించాలి:
వ్యాధి సోకిన వాటిని వేరు చేసి, పశువుల పాక ని క్రిమి సంహారక పందులతో, వాషింగ్ సోడాతో కడగాలి. చనిపోయిన పశువులని సున్నపు గోతిలో పూడ్చాలి. వ్యాధి సోకిన పశువుల పాలను దూడలకి త్రాగించకూడదు. మార్చి – ఏప్రిల్ ఆగస్టు – సెప్టెంబర్ మాసాలకు ముందుగా వ్యాధి నిరోధక టీకా వేయించాలి. కలి గిట్టలు మధ్య పుండ్లను పొటాషియం పర్మoగానెట్ ద్రావణంతో కడిగి, ఈగలు వాలకుండా వేప నూనె రాయాలి పూయాలి. వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి రవీందర్, మధుమోహన్, మతిన్, సంధ్య, నర్సయ్య, మాజీ ఎంపిటిసి దాసరి తిరుపతి, నక్క కొమురయ్య, గొట్కూరి చందు, గడ్డి కొమురయ్య, మల్లేశం, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.