నేర నియంత్రణ ప్రధాన ప్రధాన లక్ష్యం
రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 15, నేటిధాత్రి:
విజిలెన్స్&యాంటీ కరప్షన్ కౌన్సిల్- విఎసిసి లోగోను రామకృష్ణాపూర్ పట్టణంలోని వి ఎ సి సి కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. అనంతరం కౌన్సిల్ చైర్మన్ డా. రాజలింగు మోతె, అడ్వకేట్ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన ప్రజా పోలీసు సంబంధాలను అభివృద్ధి చేయడం, సమాజం నుండి అవినీతిని, ఇతర సాంఘిక దురాచారాలను నిర్మూలించడమే లక్ష్యంగా కౌన్సిల్ పనిచేస్తారని అన్నారు. అవినీతిని నిర్మూలించడానికి, అవగాహన కల్పించడానికి పోలీసు,మీడియా,ప్రజలకు కౌన్సిల్ పనిచేస్తుందన్నారు.
అన్ని రకాల నేర కార్యకలాపాలను నియంత్రించడానికి పోలీస్ , మీడియా మద్దతుతో కౌన్సిల్ సభ్యులు పనిచేస్తారని ఆయన తెలిపారు. కార్యక్రమంలోదుర్గం వెంకటేష్, మోతె రవి, వేల్పుల మల్లేష్, గుడ్ల శ్రీనివాస్, బాలుతదితరులు పాల్గొన్నారు.