మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

జైపూర్,నేటి ధాత్రి :

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం రోజున జైపూర్ ఎంపీపీ గోదారి రమాదేవి లక్ష్మణ్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ ఎంతో మంది అమరవీరుల ప్రాణ త్యాగానికి, పోరాటపటిమకి పరమార్థం దక్కిన ఈ రోజుని పవిత్రమైన పండుగలగా ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు భావించాలని, ఆ మహనీయుల ఘనతని, చరిత్రని ఏప్పుడు మదిలో చెరగని ముద్రలా దాచుకుని భావితరాలకు తప్పక తెలియజేయాలని,నేటి యువతరం వారి శక్తిని,యుక్తిని,ఘనకీర్తిని స్ఫూర్తిగా తీసుకుని భాధ్యతగా తలచుకొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి గోదారి రమాదేవి లక్ష్మణ్, ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, మండల స్థాయి అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version