గంగాధర నేటిధాత్రి :
మండలంలోని ఉప్పెర మల్యాల గ్రామ శివారులో గల చెరువు సమీపంలోని బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతుడికి సుమారు 45 ఏళ్లు ఉంటాయని గ్రామస్థులు చెప్పారు. మృతదేహం గుర్తు పట్టరాని విధంగా ఉందన్నారు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు,ఉప్పర్ మల్యాల గ్రామ శివారు లోని వ్యవసాయ బావిలో ఒక గుర్తు తెలియని మగ మృతదేహం లభ్యమైందని, సుమారు 45 సంవత్సరాల వయస్సు, నీలం రంగు ప్యాంటు, లేత నీలం రంగు టీ షర్ట్ ధరించి ఉన్నాడని, ఇట్టి గుర్తుతెలియని శవం, మరణం పైన కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించడమైనదని ఎస్సై నరేందర్ రెడ్డి తెలిపారు. ఇట్టి శవం ఆచూకి తెలిసిన వాళ్ళు గంగాధర పోలీస్ స్టేషన్ ఎస్ఐ నరేందర్ రెడ్డిని ని సంప్రదించాల్సిందిగా సూచించారు.