ఉప్పల్
11 నవంబర్ (నేటిధాత్రి):
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి ఉప్పల్ చిలుకానగర్‌కు చెందిన నాయిబ్రాహ్మణులు ఏకగ్రీవంగా తమ మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా శుక్రవారం ఉప్పల్‌లో బీఆర్ఎస్ నాయకులు పూడూరి జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బండారి లక్ష్మారెడ్డిని నాయిబ్రాహ్మణులు కలిసి తమ మద్దతును ప్రకటించారు.బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తమకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నదని నాయిబ్రాహ్మణులు తెలిపారు.ఆపదలో ఉందంటే ఆదుకునే వ్యక్తిత్వం ఉన్న బండారి లక్ష్మారెడ్డికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని,ఆయన గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు,లక్ష్మారెడ్డికి మద్దతు ఇస్తూ నాయి బ్రాహ్మణులు తీర్మానం చేశారు. బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ… తనకు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చిన నాయిబ్రాహ్మణులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు.వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు