ప్రధాన కార్యదర్శిగా గుర్రాల రవీందర్.
మలహర్ రావు. నేటిధాత్రి :
తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ అడ్వరయంలో ఎన్నిక హన్మకొండ కేంద్రంగా చేసుకొని తెలంగాణ రాష్ట్ర తుడుందెబ్బ ను బలోపేతం చేయటం కోసం ఆదివాసీల హక్కులను కాపాడటం కోసం విద్యా, వైద్యం, అటవీ హక్కుల కోసం ఆదివాసీ చట్టాలను పరిరక్షించి అభివృద్ధి చేయటంకోసం నూతన కమిటీనీ శుక్రవారం ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు. ఇట్టి కమిటీకీ రాష్ట్ర ప్రధాన అధ్యక్షుడిగా గుర్రాల రవీందర్ ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీలు నా పై ఇంతటి బాధ్యత మోపి మళ్ళీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా ఎన్నుకున్నందుకు ఆదివాసీ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.