హుజురాబాద్ :నేటిదాత్రి
* రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు*
దేశ సేవ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా త్యాగాలు చేసిన గొప్ప కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం
హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ అన్నారు.
జనహృదయనేత, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ శ్రీ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్బంగా హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలోకాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కేక్ కటింగ్ చేశారు.హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు పటాసులు కాల్చి సంబరాలుచేసుకున్నారు.
హుజురాబాద్ చౌరస్తాలో 53 కేజీల భారీ కేక్ ను
వోడితల ప్రణవ్ కటింగ్ చేసి కాంగ్రెస్ నాయకులకు తినిపించారు..అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయిన మహిళలకు వోడి తల ప్రణవ్ కాంగ్రెస్ నాయకుల తో కలిసి బ్రేడే ,అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కల్పిస్తున్న వసతులు, ఆస్పత్రి వైద్య సిబ్బంది వివరాలు తెలుసుకొని మరింత మెరుగుగా వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.