జోనల్ కమిషనర్ మందలింపే కారణమా…?
హైడ్రా చర్యలతో అధికారుల్లో గుబులు.
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:-
శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏవిపి మరియు సెక్షన్ అధికారి ఒకేసారి సెలవులు తీసుకున్నారు. ఒకేసారి ఇద్దరికి 15 రోజుల పాటు సెలవులు ఇవ్వడంతో టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో పలు ఫైల్ లు కదలకుండా ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ కింది స్థాయి అధికారులు సర్ వచ్చేదాకా పనులు కావని ప్రజలకు సమాదానాలు ఇస్తున్నారు. 15 రోజుకు పాటు ఇద్దరు అధికారులు సెలవులు పెట్టడానికి ప్రధాన కారణం ఏమిటని ప్రజలు అనుకుంటున్నారు.
*జోనల్ కమిషనర్ మండలింపు కారణమా…?*
జోనల్ కమిషనర్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ లోని ఇద్దరు అధికారులను మండలించడంతోనే ఒకేసారి సెలవులు పెట్టడం ఒక కారణం..? అని శేరిలింగంపల్లి సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్న…. అవి ఎంతవరకు నిజమో చూడాలి. ఒకవైపు హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాల పై ఉక్కుపాదం మోపుతూ అధికారులు గుండెల్లో గుబులు పుట్టిస్తుండగా, ఏ తప్పు ఎక్కడ బయట పడుతుందో అని అధికారులు సైతం భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ సమయంలో మున్సిపల్ లొనే ప్రధాన విభాగం అయిన టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో ఒకే సమయంలో ఇద్దరు అధికారు వరుస సెలవులు అందరిని ఆలోచనలో పడేసింది.
*హైడ్రా చర్యలతో అధికారుల్లో భయం…
*
అక్రమ నిర్మాణాలు విషయంలో తప్పుడు నివేదిక ఇచ్చిన అధికాలరులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేయడంతో ఇప్పుడు అన్ని విభాగం అధికారుల్లో టెన్షన్ మొదలయ్యింది. గతంలో వారు చేసిన తప్పు ఎక్కడ బయటపడుతుందో అని భయం అధికారుల్లో ఉంది. తాజాగా అక్రమ నిర్మాణాలపై తప్పుడు నివేదికతో అనుమతులు ఇచ్చిన కొందరు అధికారులపై హైడ్రా చర్యలు తీసుకోగా అందులో చందానగర్ సర్కిల్లో మాజీ డీసీ ఉండడంతో ఇక్కడ అధికారుల్లో మరింత భయం నెలకొంది.