ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటిధాత్రి:-
ఓదెల మండలం గోపరపల్లే గ్రామ శివారు లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.వివరాల్లోకి వెళితే సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ముగ్గురు యువకులు ఒకే మోటార్ సైకిల్ పై వెళుతుండగా అజాగ్రత్తగా అతివేగంగా నడిపి అదుపు తప్పి కింద పడగా గోపరపల్లి గ్రామానికి చెందిన దాసరి వంశీకృష్ణారెడ్డి మరియు పెగడపల్లికి చెందిన జీల మహేష్ లకు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రి కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.దాసరి గోపాలరెడ్డి ఫిర్యాదు మేరకు మోటార్ సైకిల్ ను అజాగ్రత్తగా అతివేగంగా నడిపి ప్రమాదానికి కారణమైనటువంటి శుగ్లంపల్లి గ్రామానికి చెందిన పసిడ్ల సంజయ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని పొత్కపల్లి ఎస్ఐ ఎన్ శ్రీధర్ తెలిపారు.