ఎంహెచ్ పిఎస్ వ్యవస్థపాక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ
హన్మకొండ,నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగ లను రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు విస్మరిస్తున్నాయని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అద్యక్షులు మైస ఉపేందర్ మాదిగ అన్నారు.మంగళవారం హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో సంఘ నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ జనాభా కలిగిన మాదిగ లను విస్మరించండం వలనే అధికారం కోల్పోయిందని ఎద్దేవా చేశారు.తెలంగాణ మూడు ఎస్సీ పార్లమెంటు స్థానాలలో రెండు మాదిగ లకు కేటాయించాలని,తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా మాదిగలు ఉన్నారని,అధికార,ప్రతిపక్ష పార్టీలు మాదిగ లకు కాకుండా ఎవరికి పార్లమెంటు టికెట్ కేటాయించిన ఆయా పార్టీ లను తెలంగాణ రాష్ట్రంలోని మాదిగలు బొంద పెట్టుడు ఖాయమని హెచ్చరించారు.వరంగల్ పార్లమెంటు స్థానం మాదిగ లకే కేటాయించాలని పార్టీ లను డిమాండ్ చేశారు.