-రెండు పోలియో చుక్కలతో అంగవైకల్యాన్ని రూపుమాపుదాం
-మున్సిపల్ కౌన్సిలర్ పచ్చిమడ్ల సతీష్ గౌడ్
చేర్యాల నేటిధాత్రి…
రెండు పోలియో చుక్కలతో అంగవైకల్యాన్ని రూపుమాపుదామని మున్సిపల్ కౌన్సిలర్ పచ్చిమడ్ల సతీష్ గౌడ్ అన్నారు.12వ వార్డులోని ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని సతీష్ గౌడ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా సతీష్ గౌడ్ మాట్లాడుతూ..అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ఆయా సెంటర్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బూత్‌లలో ప్రజలు తప్పకుండా తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఇంటింటికి తిరిగి మిగిలిపోయిన చిన్నారులకు కూడా చుక్కల మందు వేయాలని సతీష్ గౌడ్ వైద్యాధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, అంగన్వాడి సిబ్బంది, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.